Ramchandar Rao | విమోచన సత్యాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరవరు: రాంచందర్‌రావు
Ramchandar Rao | తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలు, త్యాగాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరవరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచదర్‌రావు పేర్కొన్నారు.
Ramchandar Rao | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ విమోచనం కోసం జరిగిన పోరాటాలు, త్యాగాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరవరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచదర్‌రావు పేర్కొన్నారు. ఎంఐఎం భయంతో, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నిరాకరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ విమోచన వేడుకల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన మహిళా శక్తి స్కూటీ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొని ప్రసంగించారు.
రజాకార్ల రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఎంఐఎం ప్రభావానికి ఆ రెండు పార్టీలు తలొగ్గుతున్నాయి. హైదరాబాద్ విమోచన కోసం ప్రాణ త్యాగాలు చేసిన వీరులను సైతం సముచితంగా స్మరించేందుకు వెనుకాడుతున్నాయి. మన చరిత్రను గుర్తుంచుకోవడమే కాదు, తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటాలు, త్యాగాల గురించి భావితరాలకు తెలియజేయడం అత్యంత అవసరం. ఈ చరిత్రను ప్రజల జ్ఞాపకాల నుంచి చెరిపివేయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా ప్రజలు సత్యాన్ని ఎన్నటికీ మరవనివ్వరు.
నిజాం, రజాకార్ల పాలనలో తెలంగాణ మహిళలు ఎన్నో దారుణాలకు గురయ్యారు. నేడు అదే నేలపై నారీశక్తి ముందుండి, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సంకల్పంతో ఉత్సాహభరితమైన స్కూటీ ర్యాలీకి నాయకత్వం వహించడం ఒక శక్తివంతమైన మార్పుకు ప్రతీక. అణచివేత నుంచి సాధికారత దిశగా ఇదే నవభారత స్ఫూర్తి అని రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు.
సంబంధిత వార్తలు

Revanth meets Prince Rahim Aga khan-V | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను కోరిన సీఎం రేవంత్
సెప్టెంబర్ 15, 2026

Kishan Reddy | తెలంగాణ విమోచన వేడుకలు జరిపేందుకు భయపడుతున్న కాంగ్రెస్, బీజేపీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సెప్టెంబర్ 15, 2026

KTR | తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేస్తున్న పోలీసు శాఖ: కేటీఆర్
సెప్టెంబర్ 15, 2026
తాజావార్తలు
- ●Bajaj Holdings | బజాజ్ హోల్డింగ్స్ భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.65..
- ●US Space Force | అంతరిక్షంలోనూ మా ఆయుధాలు ఉన్నాయ్.. అమెరికా బహిరంగ ప్రకటన
- ●Revanth meets Prince Rahim Aga khan-V | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను కోరిన సీఎం రేవంత్
- ●Samsung Galaxy S26 FE | గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్..
- ●AI Safety Risks | ఇక నావల్ల కాదు.. వచ్చే ఐదేళ్లలో ఏఐతో పెను విపత్తు రాబోతోందంటూ గూగుల్ డీప్‌మైండ్ రీసెర్చర్ రాజీనామా
- ●NYC Subway Accident | విషాదం.. రైల్వే ట్రాక్‌పై కూర్చుని ప్రాణాలు పోగొట్టుకున్న జంట : VIDEO

Bajaj Holdings | బజాజ్ హోల్డింగ్స్ భారీ డివిడెండ్.. ఒక్కో షేరుకు రూ.65..

US Space Force | అంతరిక్షంలోనూ మా ఆయుధాలు ఉన్నాయ్.. అమెరికా బహిరంగ ప్రకటన

Revanth meets Prince Rahim Aga khan-V | తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు రండి.. ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను కోరిన సీఎం రేవంత్

Samsung Galaxy S26 FE | గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్..







