Telangana Budget | ఈ నెలాఖరులోనే రాష్ట్ర బడ్జెట్ !
Telangana Budget | తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఈ నెలాఖరులో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం రాత్రి సమావేశమైన సీఎం అధికారులకు సూచనలు చేశారు.
వారంపాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం
సంక్షేమ పథకాలకు కేటాయింపుపై ఉత్కంఠ
ఆరు గ్యారెంటీలకు నిధులు దక్కేనా ?
వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు పెద్ద పీఠ ?
నిరుద్యోగ భృతికి మొండిచేయేనా ?
కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు నిరాశే
Telangana Budget | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఈ నెలాఖరులో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు తగిన సూచనలు చేశారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం రాత్రి సమావేశమైన సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. ఈ నెల 1న పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర నిధులపై కూడా ఆయన సమీక్షించారు. ఈ నెల చివరి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై వారంపాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై ఉత్కంఠ నెలకొంది.
గతేడాది రూ. 3.04 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2025-2026) అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2025 మార్చి 12న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో 2025 మార్చి 19న బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ.3,04,965 కోట్ల అంచనా వ్యయంతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ఉంది. రాష్ట్రం అప్పులు రూ.5,04,814 కోట్లుగా పేర్కొన్నారు ఆరు గ్యారంటీల అమలు కోసం బడ్జెట్‌లో 56,084 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
ఈ ఏడాది కేటాయింపులపై ఉత్కంఠ..
రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేటాయింపులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది బడ్జెట్ రూ.3.26 లక్షల కోట్లుగా ఉండే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలకు కేటాయింపులతో పాటు, ఆరు గ్యారెంటీల అమలుపై ఉత్కంఠ నెలకొంది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.రెండు వేల నుంచి రూ. నాలుగు వేలకు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయిన నేపథ్యంలో ఇప్పటికైనా పెన్షన్‌ల పెంపు సరిపడా నిధులు కేటాయిస్తారో లేదోనని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కీలకమైన వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రెండేళ్లకు పైగా పాలనలో ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడంతో ఆగ్రహంగా ఉన్న నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు నిరుద్యోగ భృతిని ప్రకటిస్తారని కొంతమంది భావిస్తుండగా.. మరికొంత మంది ఆ ప్రతిపాదలను కొట్టిపారేస్తున్నారు.
కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు అప్రాధాన్యం..
ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు అంతగా ప్రాధాన్యం దక్కలేదు. బడ్జెట్‌లో తెలంగాణ కోరిన 47 డిమాండ్లను కేంద్రం పట్టించుకోలేదు. కేవలం మూడు రైల్వే స్పీడ్ కారిడార్‌లను ప్రకటించి, చేతులు దులుపుకుంది. ఆ కారిడార్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య రవాణాను వేగవంతం చేసేందుకు ఉద్దేశించినవి కావడం గమనార్హం.
బడ్జెట్‌లో తెలంగాణ కోరిన 47 డిమాండ్లు ఇవే..
ఈ డిమాండ్లలో హైదరాబాద్ నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది.
కీలక ప్రాజెక్టులు – నిధుల అంచనా
గోదావరి-మూసీ అనుసంధానం: మూసీ నది ప్రక్షాళన మరియు పునరుజ్జీవనంలో భాగంగా గోదావరి జలాలను మూసీకి అనుసంధానించే ప్రాజెక్టు కోసం ₹6,000 కోట్లు కేటాయించాలని కోరింది.
మురుగునీటి మాస్టర్ ప్లాన్: హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మురుగునీటి వ్యవస్థను ఆధునీకరించేందుకు (Comprehensive Sewerage Master Plan) ₹17,212 కోట్లు కావాలని అభ్యర్థించింది.
మెట్రో రైల్ ఫేజ్-2: హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ కోసం కేంద్రం తన వాటాగా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేసింది.
విద్య మరియు మౌలిక వసతులు
IIM హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.
రవాణా వ్యవస్థ: రీజనల్ రింగ్ రోడ్ (RRR), రేడియల్ రోడ్ల విస్తరణతో పాటు రాష్ట్రంలో కొత్తగా 8 రైల్వే ప్రాజెక్టుల మంజూరుకు నిధులు ఇవ్వాలని విన్నవించింది.
ఈ డిమాండ్లను కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ ప్రతిపాదనల్లో వాటికి నిధుల కేటాయింపు ఎంత చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



