CURE | వికేంద్రీకృత పాలనకు ‘క్యూర్’
CURE | మెట్రోపాలిటన్ ప్రాంతంలో పట్టణ పాలనను ఆధునికీకరించేందుకు క్యూర్ (CURE) బిల్లును తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ బిల్లుతో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లు సమగ్ర పాలనా వ్యవస్థలోకి రానున్నాయి.
- మూడు కార్పొరేషన్లలో అమలుకు బిల్లు విడుదల
- కుక్క పన్ను రద్దు, సకాలంలో పన్నులు చెల్లిస్తే రాయితీలు
- సంస్కరణలు సూచించి ప్రజాభిప్రాయం కోరిన సర్కార్
CURE | త్రినేత్ర.న్యూస్: మెట్రోపాలిటన్ ప్రాంతంలో పట్టణ పాలనను ఆధునికీకరించేందుకు క్యూర్ (CURE) బిల్లును తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. 1.3 కోట్ల జనాభాతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంగా అభివృద్ధి చెందడంతో ప్రస్తుతం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం-1955కు ప్రత్యామ్నాయంగా ఈ బిల్లును ప్రభుత్వం తీసుకురానుంది. ఈ బిల్లుతో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లు సమగ్ర పాలనా వ్యవస్థలోకి రానున్నాయి. మెట్రో స్థాయిలో సమన్వయంతో పాటు కార్పొరేషన్ స్థాయిలో వికేంద్రీకృత పరిపాలనను కొనసాగించే విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ప్రజలు, నిపుణులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలపాలని ప్రభుత్వం పేర్కొంది.
GHMC చట్టంలో కొనసాగేవివే..
- కార్పొరేషన్లు, స్టాండింగ్ కమిటీలు, కమిషనర్లు, వార్డ్ కమిటీలు, ఎన్నికల నిర్వహణ, ఆస్తి పన్ను పరిపాలన, రుణాల సేకరణ అధికారాలు, జంతు సంరక్షణ వంటి ప్రధాన నిబంధనలు కొనసాగించడం
- మున్సిపల్ సంస్థల్లో ట్రాన్స్‌జెండర్ సభ్యునికి ప్రాతినిధ్యం కల్పించడం
- కాలం చెల్లిన ఎన్నికల అనర్హత నిబంధనలను తొలగించడం
ఇవీ ముఖ్య సంస్కరణలు..
ఆస్తి పన్ను
- వార్షిక అద్దె విలువ (Annual Rental Value) విధానానికి బదులుగా మూలధన విలువ (Capital Value) ఆధారిత విధానం
- ఆక్ట్రాయ్, కుక్క పన్ను (Dog Tax) రద్దు
- స్వీయ అంచనా విధానం ప్రవేశపెట్టడం
- సమగ్ర ఆస్తి గుర్తింపు కోడ్ (Integrated Property Identity Code)
- సమయానికి పన్నులు చెల్లించే వారికి రాయితీలు
కల్పించే వసతులు..
- GIS ఆధారిత వీధుల అభివృద్ధి ప్రణాళికలు
- యూనివర్సల్ డిజైన్ ప్రమాణాలు
- భూగర్భ యుటిలిటీ వ్యవస్థలు
- భవనాల నిర్మాణాలకు డీమ్డ్ అప్రూవల్ విధానం
- చిన్నపాటి ఉల్లంఘనలకు క్రిమినల్ చర్యల బదులుగా దశలవారీ సివిల్ జరిమానాలు
- అన్ని వ్యాపారాలకు ఒకే ట్రేడ్ లైసెన్స్
- నైట్ ఎకానమీకి ప్రత్యేక విధానం
ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం..
- ప్రజారోగ్యానికి సంబంధించి ప్రత్యేక అధికారాలు
- ప్రజా ఇబ్బందుల పరిష్కార వ్యవస్థ సరళీకరణ
- మాన్యువల్ స్కావెంజర్స్ చట్టానికి అనుగుణంగా పారిశుద్ధ్య వ్యవస్థ
- నీటి సరఫరా, మురుగునీటి నియంత్రణ బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB)కి అప్పగించడం
సమగ్ర పాలనకు నూతన సంస్థలు..
- ముఖ్యమంత్రి అధ్యక్షతన CURE అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు
- చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం HYDRAAకు ప్రత్యేక బాధ్యతలు
- విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణ, వాతావరణ మార్పు చర్యలు, వారసత్వ పరిరక్షణ, ఆహార భద్రత, లింగ సమానత్వం, కార్మిక సంక్షేమం కోసం ప్రత్యేక సంస్థలు
డిజిటల్, పౌర సేవలు..
- అత్యవసర సమన్వయం, బహుళ సంస్థల పర్యవేక్షణ కోసం CURE SMART గవర్నెన్స్ సెంటర్ ఏర్పాటు
- సమగ్ర డిజిటల్ పోర్టల్
- ఒకే సమీకృత యుటిలిటీ బిల్లు
- ఫిర్యాదుల త్వరిత పరిష్కారం కోసం CURE అప్పీలేట్ అథారిటీ ఏర్పాటు

తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



