Leopard | ఇంట్లో దూరేందుకు చిరుత యత్నం.. వణికిపోయిన ఫ్యామిలీ
Leopard | ఉన్నట్టుండి ఓ చిరుత పులి ఇంట్లోకి చొరబడేందుకు యత్నించడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఎక్కడ తమ ఇంటిలోకి దూరుతుందేమోనని కేకలు వేశారు.
Leopard | త్రినేత్ర.న్యూస్: ఉన్నట్టుండి ఓ చిరుత పులి ఇంట్లోకి చొరబడేందుకు యత్నించడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. దాన్ని చూసిన కుటుంబ సభ్యులు వణికిపోయారు. ఎక్కడ తమ ఇంటిలోకి దూరుతుందేమోనని కేకలు వేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
వెంకటాపురం గ్రామంలోని లెక్చరర్ బాలాజీ నివాసంలోకి చిరుత పులి చొరబడేందుకు ప్రయత్నించింది. దాదాపు నాలుగు నిమిషాలపాటు ఇంటి కంపౌండ్ వాల్ దగ్గరే నక్కి కూర్చింది. గోడపై నుంచి ఇంట్లోకి చొరబడేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ఆ సమయంలో దాన్ని చూసిన బాలాజీ కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేశారు. ఆ అరుపులు విన్ని చిరుత అక్కడి నుంచి జారుకుంది. ఈ దృశ్యాలను పలువురు తమ సెలఫోన్లలో బంధించారు. కాగా చిరుత సంచారంతో తమకు కంటిమీద కునుకు లేకుండా పోతుందని, దాన్ని వెంటనే బంధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాణాలకేమైనా జరిగితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్
ఇంట్లోకి చొరబడేందుకు చిరుత పులి యత్నం..కుటుంబ సభ్యుల కేకలతో పారిపోయిన పులి
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామంలోని లెక్చరర్ బాలాజీ నివాసంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన చిరుత పులి
భయంతో కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో పరార్
చిరుతపులి సంచారంతో… pic.twitter.com/RrrTGWwWXz
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2026
తాజావార్తలు
- ●Shambipur Raju | కేటీఆర్ కాన్వాయ్కి ప్రమాదం.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు గాయాలు
- ●Ponnam Prabhakar | మట్టి కుండలోనే బోనం చేద్దాం.. చేతివృత్తులను ప్రోత్సహిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Alka Lamba | బీజేపీది.. చందా చోర్ సర్కార్.. మహిళా వ్యతిరేక సర్కార్
- ●Drunk and Drive | సైబరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. 190 మందిపై కేసులు
- ●Vande Bharat Express | భారీ వర్షాలకు నీట మునిగిన పట్టాలు.. దూసుకెళ్లిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. వీడియో
- ●KTR | బీఆర్ఎస్ కన్నేపల్లి పంప్‌హౌస్ సందర్శన.. కేటీఆర్ బృందాన్ని జనగామ వద్ద అడ్డుకున్న పోలీసులు

Shambipur Raju | కేటీఆర్ కాన్వాయ్కి ప్రమాదం.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు గాయాలు

Ponnam Prabhakar | మట్టి కుండలోనే బోనం చేద్దాం.. చేతివృత్తులను ప్రోత్సహిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్

Alka Lamba | బీజేపీది.. చందా చోర్ సర్కార్.. మహిళా వ్యతిరేక సర్కార్

Drunk and Drive | సైబరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. 190 మందిపై కేసులు




