త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kazipet – Balharshah | రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. కాజీపేట – బ‌ల్లార్షా మూడో లైన్ సిద్ధం

Kazipet - Balharshah | రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభవార్త‌.. కాజీపేట - బ‌ల్లార్షా మ‌ధ్య మూడో లైన్ సిద్ధ‌మైంది. ఈ మేర‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ మూడో లైన్ పూర్తి కావ‌డంతో.. ప్ర‌యాణికుల రైళ్ల‌తో పాటు స‌రుకు ర‌వాణా రైళ్ల రాక‌పోక‌లు మ‌రింత వేగం కానున్నాయి.

S

Telangana | Published On Jul 23, 2026, 1.53 pm IST

Kazipet – Balharshah | రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. కాజీపేట – బ‌ల్లార్షా మూడో లైన్ సిద్ధం
Advertisement

Kazipet - Balharshah | త్రినేత్ర‌.న్యూస్ : రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభవార్త‌.. కాజీపేట - బ‌ల్లార్షా మ‌ధ్య మూడో లైన్ సిద్ధ‌మైంది. ఈ మేర‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ మూడో లైన్ పూర్తి కావ‌డంతో.. ప్ర‌యాణికుల రైళ్ల‌తో పాటు స‌రుకు ర‌వాణా రైళ్ల రాక‌పోక‌లు మ‌రింత వేగం కానున్నాయి.

కాజీపేట - బ‌ల్లార్షా మ‌ధ్య దూరం 202 కిలోమీట‌ర్లు. రెండు లైన్లు ఉన్న‌ప్పుడు నిత్యం 160కి పైగా రైళ్ల రాక‌పోక‌లు సాగేవి. ఇప్పుడు మూడో లైన్ కూడా అందుబాటులోకి రావ‌డంతో.. ఈ మార్గంలో అద‌నంగా మ‌రో 100 రైళ్ల‌కు పైగా న‌డిపేందుకు మార్గం సుగ‌మ‌మైంది. ప్రయాణికుల రైళ్లతోపాటు సరుకు రవాణా రైళ్లను విస్తృతంగా తిప్పాలని భావిస్తోంది.

Advertisement
Advertisement