Rain Alert | తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండీ
Rain Alert | తెలంగాణలో రాగల నాలుగు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Rain Alert | తెలంగాణలో రాగల నాలుగు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడొచ్చని తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించింది.
సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
బుధవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని అంచనా వేసింది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తాజావార్తలు
- ●Job Mela | ఆగస్టు 24న హైదరాబాద్లో మెగా జాబ్ మేళా
- ●Minister Komatireddy | రోడ్ల పనుల్లో జాప్యం వద్దు.. వేగం పెంచాలి: కోమటిరెడ్డి
- ●కొండా ఫ్యామిలీకి ఒకలా?… కోమటిరెడ్డి ఫ్యామిలీకి మరోలా? తెలంగాణ కాంగ్రెస్లో డబుల్ స్టాండర్డ్స్ రచ్చ!!
- ●Adluri Laxman Kumar | ఆశ్రమ పాఠశాలల్లోని సీఆర్టీ సిబ్బంది సమస్యలు పరిష్కారిస్తాం : మంత్రి అడ్లూరి
- ●Bhadohi Train Accident | విషాదం.. రూ.100 ఇవ్వలేదని రైలు కింద పడేందుకు పరుగెత్తిన కొడుకు.. కాపాడబోయి తల్లి మృతి
- ●New EHS Scheme | అమల్లోకి కొత్త ఈహెచ్ఎస్ పథకం

Job Mela | ఆగస్టు 24న హైదరాబాద్లో మెగా జాబ్ మేళా

Minister Komatireddy | రోడ్ల పనుల్లో జాప్యం వద్దు.. వేగం పెంచాలి: కోమటిరెడ్డి

కొండా ఫ్యామిలీకి ఒకలా?… కోమటిరెడ్డి ఫ్యామిలీకి మరోలా? తెలంగాణ కాంగ్రెస్లో డబుల్ స్టాండర్డ్స్ రచ్చ!!

Adluri Laxman Kumar | ఆశ్రమ పాఠశాలల్లోని సీఆర్టీ సిబ్బంది సమస్యలు పరిష్కారిస్తాం : మంత్రి అడ్లూరి




