త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | రాబోయే మూడురోజుల్లో ఈ జిల్లాల్లో వ‌డ‌గాలులు.. ప‌లుచోట్ల గాలివాన‌లు..

TG Weather | తెలంగాణలో రాగ‌ల ఐదురోజుల్లో పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయ‌ని, మ‌రికొద్ద జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం నుంచి పలుచోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది.

P

Telangana | Published On Apr 27, 2026, 4.37 pm IST

TG Weather | రాబోయే మూడురోజుల్లో ఈ జిల్లాల్లో వ‌డ‌గాలులు.. ప‌లుచోట్ల గాలివాన‌లు..
Advertisement

TG Weather | తెలంగాణ‌లో ఎండ‌లు దంచికొడుతున్నాయి. ఉద‌యం నుంచే భానుడు ప్ర‌తాపం చూపిస్తున్నాడు. దాంతో జ‌నం బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్ర‌మంలో కీల‌క హెచ్చ‌రిక‌లు చేసింది. రాబోయే రోజుల్లో ప‌లు జిల్లాల్లో వ‌డ‌గాలు వీస్తాయ‌ని, ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కొన‌సాగే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. సోమ‌వారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌డ‌గాలులు వీచే అవ‌కాశాలున్నాయ‌ని పేర్కొంది. వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయ‌ని తెలిపింది.

మంగ‌ళ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిజామాబాద్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌డ‌గాలులు వీస్తాయ‌ని తెలిపింది. న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, యాదాద్రి భువ‌న‌గిరి, వికారాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, జోగులాంబ‌, నారాయ‌ణ‌పేట జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. బుధ‌వారం నిజామాబాద్‌, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, భువ‌న‌గిరి, కామారెడ్డి, మెద‌క్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, హ‌నుమ‌కొండ‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో అక్క‌డ‌క్కడ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.

గురువారం రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, న‌ల్గొండ‌, ఖ‌మ్మం, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగల్‌, హ‌నుమ‌కొండ‌, జనగాం, సిద్దిపేట‌, భువ‌న‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని వివ‌రించింది. శుక్ర‌వారం కరీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, మ‌హ‌బూబాబాద్‌తో పాటు ప‌లు జిల్లాలో ఉరుములు, ఈదురుగాలులుతో కూడిన వాన‌లు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని తెలిపింది.

Advertisement
Advertisement