త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Employees JAC | దీర్ఘ‌కాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి: టీజీఈ జేఏసీ

TGE JAC | రాష్ట్రంలో ఉద్యోగుల‌కు సంబంధించి దీర్ఘ‌కాలికంగా పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGE JAC) డిమాండ్ చేసింది. న్యాయ‌బ‌ద్ద‌మైన డిమాండ్లు కూడా అమ‌లుకు నోచుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించింది.

G

Telangana | Published On Apr 17, 2026, 7.15 am IST

TG Employees JAC | దీర్ఘ‌కాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల‌ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి: టీజీఈ జేఏసీ
Advertisement

TG Employees JAC | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలో ఉద్యోగుల‌కు సంబంధించిన దీర్ఘ‌కాలికంగా అనేక స‌మ‌స్య‌లు పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TG Employees JAC) డిమాండ్ చేసింది. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టాక కొన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారమైన‌ప్ప‌టికీ, ఇకా చాలా స‌మ‌స్య‌లు అలాగే పెండింగ్‌లోనే ఉన్నాయ‌ని తెలిపింది. న్యాయ‌బ‌ద్ద‌మైన డిమాండ్లు కూడా అమ‌లుకు నోచుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించింది. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే సీఎస్‌, ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లిన‌ప్ప‌టికీ వారి నుంచి స్పంద‌న రావ‌డంలేద‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలోనే పెండింగ్ స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రం, న్యాయ‌బ‌ద్ధ‌మైన డిమాండ్ల‌ను వెంట‌నే అమ‌లు చేయాల‌ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మ‌న్ వీ.ల‌చ్చిరెడ్డి, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ వొడ్నాల రాజ‌శేఖ‌ర్ పిలుపు మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా డివిజ‌న్‌, మండ‌ల కేంద్రాల‌లో ఆర్డీఓల‌కు, త‌హ‌శీల్దార్ల‌కు విన‌తిప‌త్రాలు ఇచ్చామ‌ని తెలిపింది. ఇదే విష‌యాన్ని ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లాల‌ని కోరింది.

ప్రధాన డిమాండ్లు

  • జూన్ 2వ తేదీ నాటికి పీఆర్సీ అమలు పరచాలి.
  • రిటైరైన ఉద్యోగులకు పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలి.
  • హెల్త్ కార్డ్స్ తక్షణమే అమలు చేయాలి.
  • సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానంను పునరుద్ధరించాలి.
  • 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి.
  • పెండింగ్ బిల్లులతో పాటుగా పెండింగ్ డీఏలను విడుదల చేయాలి.
  • గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 ఏండ్లు నిండిన వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి.
  • ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి.
  • ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలి.
  • ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి.
Advertisement
Advertisement