త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kamareddy | కామారెడ్డిలో ఉద్రిక్త‌త‌.. కాంగ్రెస్ నేత కారు ధ్వంసం చేసిన బీజేపీ కార్య‌క‌ర్త‌లు

Kamareddy | బీజేపీ, కాంగ్రెస్ నేత స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌తో కామారెడ్డి (Kamareddy) ప‌ట్ట‌ణంలో తీవ్ర ఉద్రిక్త‌త చోటుచేసుకున్న‌ది. కామారెడ్డి ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణారెడ్డి (Venkata Ramana Reddy) ఇంటిని కాంగ్రెస్ (Congress) నేత మహేందర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు ముట్ట‌డించారు.

G

Telangana | Published On Feb 21, 2026, 11.36 am IST

Kamareddy | కామారెడ్డిలో ఉద్రిక్త‌త‌.. కాంగ్రెస్ నేత కారు ధ్వంసం చేసిన బీజేపీ కార్య‌క‌ర్త‌లు
Advertisement

Kamareddy | త్రినేత్ర‌.న్యూస్‌: బీజేపీ, కాంగ్రెస్ నేత స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌తో కామారెడ్డి (Kamareddy) ప‌ట్ట‌ణంలో తీవ్ర ఉద్రిక్త‌త చోటుచేసుకున్న‌ది. కామారెడ్డి ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణారెడ్డి (Venkata Ramana Reddy) ఇంటిని కాంగ్రెస్ (Congress) నేత మహేందర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు ముట్ట‌డించారు. ఎమ్మెల్యే డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో బీజేపీ నేత‌లు వారిని అడ్డుకోవ‌డంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. ఈ క్ర‌మంలో మహేందర్‌రెడ్డి కారును కింద‌ప‌డేసి, అద్దాల‌ను ధ్వంసం చేశారు. అడ్డుకున్న పోలీసుల‌తో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.

కామారెడ్డిలో ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజీ భూములు, శిశు మందిర్ పాఠ‌శాల, అరోరా కాలేజీ భూముల క‌బ్జా విష‌యంలో కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. ఇందులో నిజానిజాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఎమ్మెల్యే వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి స‌వాల్ విసిరారు. దీంతో తామూ చ‌ర్చ‌కు సిద్ధ‌మేన‌ని కాంగ్రెస్ నేత‌లు ప్ర‌తి స‌వాల్ చేశారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ నాయ‌కులు సాక్ష్యాధారాల‌తో చ‌ర్చ‌కు రావాల‌ని బీజేపీ ఎమ్మెల్యే ర‌మ‌ణా రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో కామారెడ్డిలో ప‌రిస్థితి ఒక్క‌సారిగా వేడెక్కింది.

Advertisement
Advertisement