త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shankar Goud | శంకర్​ గౌడ్ అంత్యక్రియలు.. ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తత

G

Telangana | Published On Apr 24, 2026, 12.15 pm IST

Shankar Goud | శంకర్​ గౌడ్ అంత్యక్రియలు.. ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తత
Advertisement

Shankar Goud | త్రినేత్ర‌.న్యూస్‌: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ (Shankar Goud) అంత్య‌క్రియ‌ల సంద‌ర్భంగా న‌ర్సంపేట మండ‌లం ముత్తోజిపేటలో (Muthojipet) తీవ్ర‌ ఉద్రిక్తత చోటుచేసుకున్న‌ది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున మృతిచెందిన‌ శంక‌ర్ గౌడ్ మృత‌దేహాన్ని తన అల్లుడి స్వగ్రామమైన ముత్తోజిపేట‌కు తీసుకెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న భౌతిక‌కాయాన్ని మృతదేహాన్నినర్సంపేట డిపోనకు తరలించి నివాళులు అర్పించేందుకు కార్మికులు, కుటుంబసభ్యులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మాజీ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, కార్మికులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

మ‌రోవైపు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని నర్సంపేట పీఎస్‌కు తరలించారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల వాహనాలను బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. అదేవిధంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావును హనుమకొండలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. కాగా, శంక‌ర్‌గౌడ్ అంత్య‌క్రియ‌లు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం జ‌రుగ‌నున్నాయి.

స‌చివాలయానికి ఆర్టీసీ జేఏసీ నేత‌లు..

మ‌రోవైపు ఆర్టీసీ జేఏసీ నాయకులను ప్రభుత్వం చర్చలకు పిలిచిన సంగతి తెలిసిందే. దీంతో కార్మిక నాయకులు సెక్రటేరియెట్​కు వెళ్లారు. సచివాలయంలో సీనియర్ ఐఏఎస్ కమిటీ సభ్యుల‌తో భేటీ అయ్యారు. అంత‌కుముందు శంకర్ గౌడ్ మృతి, ప్రభుత్వం చర్చలకు పిలుపు నేపథ్యంలో ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. ఈ భేటీ అనంతరం ప్రభుత్వంతో తమ సమస్యల పరిష్కారంపై చర్చించడానికి సచివాలయానికి వెళ్లారు. సీనియర్​ ఐఏఎస్​ కమిటీతో సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నంతో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు తమ సమస్యల పరిష్కారాల కోసం చర్చించనున్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం భట్టి విక్రమార్క, ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొన్నం, జూపల్లితో సబ్‌ కమిటీని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

 

Advertisement
Advertisement