TG Weather | తెలంగాణలో ఐదురోజులు వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!
TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.
TG Weather | తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. రాబోయే మూడురోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు క్రమంగా పెరుగుతాయని చెప్పింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబ్‌నగర్, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడే సూచనలున్నాయని తెలిపింది.
ఆదివారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. సోమవారం మంచిర్యాల, నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వానలు పడుతాయని వెల్లడించింది. మంగళవారం నుంచి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశాలున్నాయని వివరించింది.
మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగత్రలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఎండలకు ధాటికి జనం ఇండ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగత్రలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే బయటకు వెళ్లాలని.. వీలైనంత వరకు నీడలో ఉండేందుకు ప్రయత్నించాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండలో వెళ్తున్న సమయంలో ఎక్కువగా నీటిని, మజ్జిగ, కొబ్బరినీటిని తాగాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!




