త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | తెలంగాణ‌లో రేప‌టి నుంచి ఐదురోజులు వాన‌లే.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!

TG Weather | తెలంగాణ‌లో ఆదివారం నుంచి ఐదురోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని తెలిపింది.

P

Telangana | Published On Mar 14, 2026, 4.51 pm IST

TG Weather | తెలంగాణ‌లో రేప‌టి నుంచి ఐదురోజులు వాన‌లే.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!
Advertisement

TG Weather | తెలంగాణ‌లో ఆదివారం నుంచి ఐదురోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఆదివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని తెలిపింది. సోమ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, పెద్ద‌ప‌ల్లి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, మెద‌క్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వాన‌లు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది.

మంగ‌ళ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి- వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి జిల్లాలు వాన‌లు కురుస్తాయ‌ని అంచ‌నా వేసింది. బుధ‌వారం ఉమ్మ‌డి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్, రంగారెడ్డి, మెద‌క్ జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

 

 

Advertisement
Advertisement