త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | తెలంగాణ‌లో రెండురోజులు ఈ జిల్లాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన‌లు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావ‌ర‌ణ‌శాఖ‌..!

TG Weather | తెలంగాణ‌లో రాగ‌ల ఐదురోజులు ఉరుములు, మెరుపులతో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌బాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని తెలిపింది.

P

Telangana | Published On Mar 31, 2026, 6.38 pm IST

TG Weather | తెలంగాణ‌లో రెండురోజులు ఈ జిల్లాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన‌లు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావ‌ర‌ణ‌శాఖ‌..!
Advertisement

TG Weather | తెలంగాణ‌లో రాగ‌ల ఐదురోజులు ఉరుములు, మెరుపులతో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌బాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని తెలిపింది. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, సిద్దిపేట‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌డ‌గ‌ళ్ల వాన‌లు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. గంట‌కు 40-50 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తాయ‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

అలాగే, మంచిర్యాల‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గాం, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే ఛాన్స్ ఉంద‌ని తెలిపింది. బుధ‌వారం వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు వ‌డ‌గ‌ళ్లు అక్క‌డ‌క్క‌డ అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఆయా జిల్లాల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ ఆరెంజ్ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, జ‌న‌గాం, సిద్దిపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వాన‌లు ప‌డేందుకు అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

అలాగే, గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, మెద‌క్‌, కామారెడ్డి, జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ మోస్త‌రు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. శుక్ర‌వారం ఉమ్మ‌డి ఆదిలాబాద్‌, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో, శ‌నివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిజామాబాద్‌, సిద్దిపేట‌, రంగారెడ్డి, మెద‌క్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు ప‌డేందుకు అవ‌కాశాలున్నాయ‌ని వివ‌రించింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీచేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement