త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్.. పార్టీ ఫిరాయింపుల‌పై స్పీకర్ కీల‌క తీర్పు

Telangana | తెలంగాణ‌లో పార్టీ ఫిరాయింపుల‌పై శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్రసాద్ కుమార్ కీల‌క తీర్పు వెలువ‌రించారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన‌ ఐదుగురు ఎమ్మెల్యేల‌కు స్పీక‌ర్ క్లీన్ చిట్ ఇచ్చారు.

S

Telangana | Published On Dec 17, 2025, 4.53 pm IST

Telangana | ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్.. పార్టీ ఫిరాయింపుల‌పై స్పీకర్ కీల‌క తీర్పు
Advertisement

Telangana | హైద‌రాబాద్ : తెలంగాణ‌లో పార్టీ ఫిరాయింపుల‌పై శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్రసాద్ కుమార్ కీల‌క తీర్పు వెలువ‌రించారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన‌ ఐదుగురు ఎమ్మెల్యేల‌కు స్పీక‌ర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంక‌ట్రావ్, బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి, ప్ర‌కాశ్ గౌడ్, గూడెం మ‌హిపాల్ రెడ్డిపై అన‌ర్హ‌త వేటు వేసేందుకు స్పీక‌ర్ నిరాక‌రించారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు ఎక్క‌డా ఆధారాలు లేవ‌ని స్పీక‌ర్ పేర్కొన్నారు. అన‌ర్హ‌త వేటుకు త‌గిన ఆధారాలు లేవ‌ని, సాంకేతికంగా ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న‌ట్టు స్పీక‌ర్ త‌న తీర్పులో వెలువ‌రించారు.

మొత్తం 10 మంది ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త పిటిష‌న్లు దాఖ‌లు చేయ‌గా, ఎనిమిది మందికి సంబంధించి విచార‌ణ పూర్త‌యింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్ట‌ర్ సంజ‌య్, కాలే యాద‌య్య‌ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. దానం నాగేంద‌ర్, క‌డియం శ్రీహ‌రిపై దాఖ‌లైన పిటిష‌న్ల‌కు సంబంధించిన విచార‌ణ ఇంకా పూర్తి కాలేదు. అన‌ర్హ‌త పిటిష‌న్ల‌పై స్పీక‌ర్ త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై ఎల్లుండి మ‌రోమారు విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఎనిమిది మందికి సంబంధించి విచార‌ణ పూర్తి చేసిన స్పీక‌ర్.. ఇవాళ ఐదుగురికి సంబంధించి తీర్పు ఇచ్చారు. మిగ‌తా ముగ్గురు ఎమ్మెల్యేల‌పై కూడా త్వ‌ర‌లోనే తీర్పు వెలువ‌రించే అవ‌కాశం ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement