త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gaddam Prasad | తెలంగాణ–హిరోషిమా మధ్య సహకారం పెరగాలి

Gaddam Prasad | తెలంగాణ, జపాన్‌లోని హిరోషిమా ప్రాంతాల మధ్య పారిశ్రామిక, సాంకేతిక, విద్యా రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, అధునాతన తయారీ రంగాల్లో జపాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ మానవ వనరులతో అనుసంధానిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు.

P

Telangana | Published On Oct 12, 2026, 3.31 pm IST

Gaddam Prasad | తెలంగాణ–హిరోషిమా మధ్య సహకారం పెరగాలి
Advertisement
  • శాస‌న‌స‌భ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్‌
  • భారత్‌–జపాన్ స్నేహ బంధాలు మరింత బలోపేతం కావాల‌న్న మండలి చైర్మన్ గుత్తా

Gaddam Prasad | తెలంగాణ, జపాన్‌లోని హిరోషిమా ప్రాంతాల మధ్య పారిశ్రామిక, సాంకేతిక, విద్యా రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, అధునాతన తయారీ రంగాల్లో జపాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ మానవ వనరులతో అనుసంధానిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. మరోవైపు భారత్‌–జపాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన హిరోషిమా ప్రిఫెక్చరల్ అసెంబ్లీ, ప్రభుత్వ ప్రతినిధుల బృందంతో నిర్వహించిన సమావేశంలో ఇరువురు నేతలు మాట్లాడారు. తెలంగాణలో జపాన్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని స్పీకర్ కోరారు. ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ, పరిశోధన, పారిశ్రామిక రంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. శాసన విధానాలు, సభా నిర్వహణ, కమిటీల పనితీరు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఇరు ప్రాంతాల శాసనసభలు అనుభవాలను పంచుకోవాలని సూచించారు. విద్యార్థులు, పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణుల పరస్పర మార్పిడి కార్యక్రమాలు విస్తరించాలన్నారు.

భారత్‌, జపాన్ మధ్య సంబంధాలు పరస్పర విశ్వాసం, గౌరవం, సహకారానికి ప్రతీకలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సాంకేతికత, పారిశ్రామిక అభివృద్ధి, పరిశోధనలు, ఆవిష్కరణల్లో జపాన్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. తెలంగాణ కూడా ఐటీ, ఫార్మా, వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. హిరోషిమాతో పారిశ్రామిక, సాంకేతిక, విద్యా, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవాలని సూచించారు. తెలంగాణలో జపాన్ పెట్టుబడులు పెరిగితే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.

రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్ర విధ్వంసాన్ని ఎదుర్కొన్న హిరోషిమా.. శాంతి, పునర్నిర్మాణం, అభివృద్ధికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఇరువురు నేతలు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి శాసనసభల మధ్య పరస్పర సహకారం, అనుభవాల మార్పిడి అవసరమన్నారు. హైదరాబాద్‌–జపాన్‌లోని మియోషి నగరాల మధ్య సోదర నగర సంబంధాలు ఇరు ప్రాంతాల స్నేహ బంధాలకు నిదర్శనమని తెలిపారు. కార్య‌క్ర‌మాల్లో మండ‌లి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్‌, శాసన మండలి కార్యదర్శి డాక్ట‌ర్ నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి ఆర్ తిరుపతి, జపాన్ ప్రతినిధుల బృందం సభ్యులు, ఇరు సభల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement