CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఆ లిస్ట్ రెడీ అయినట్టేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రాజెక్టుల నిధులతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీపై అధిష్ఠానంతో కీలక భేటీ కానున్నారు.
- సీఎం రేవంత్ రెడ్డి రేపు హస్తినకు పయనం
- రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ వ్యవహారాలపైనే ప్రధాన ఫోకస్
- గోదావరి, కృష్ణా బేసిన్ పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల క్లియరెన్స్‌లు
- కేంద్ర నిధులపై ఢిల్లీ పెద్దలతో భేటీ
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ, ఫ్యూచర్ సిటీ మెట్రో లైన్ల ప్రతిపాదనలపై చర్చ
- కాంగ్రెస్ సీనియర్లకు నామినేటెడ్ పదవుల కేటాయింపునకు సంబంధించిన తుది జాబితాను AICCకి అందజేసే అవకాశం
CM Revanth Reddy Delhi Tour | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు హస్తినకు పయనం కానున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల పర్మిషన్లు, కేంద్ర నిధుల సాధనతో పాటు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించేందుకు ఈ ఢిల్లీ (Delhi Tour) పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ టూర్‌లో సీఎం రేవంత్ అటు కేంద్ర మంత్రులతో, ఇటు ఏఐసీసీ (AICC) అగ్రనేతలతో వరుస భేటీలు జరపనున్నారు.
ప్రాజెక్టుల క్లియరెన్స్, కేంద్ర నిధులే టార్గెట్
సీఎం ఢిల్లీ పర్యటనలో ప్రధానంగా తెలంగాణ ఇరిగేషన్ ( Telangana Irrigation) ప్రాజెక్టుల అంశం చర్చకు రానుంది. గోదావరి, కృష్ణా బేసిన్లలోని పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్‌లు, విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అంతరాష్ట్ర జల వివాదాలపై కేంద్ర పెద్దలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
దీనితో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail) రెండో దశ విస్తరణ, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ, ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ మెట్రో లైన్ల ప్రతిపాదనల ఆమోదంపై సంబంధిత కేంద్ర శాఖల మంత్రులతో రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు.
నామినేటెడ్ పదవులపై తేలనున్న సస్పెన్స్
మరోవైపు, రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఊరిస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఈ పర్యటనతో ఒక కొలిక్కి వచ్చే చాన్స్ కనిపిస్తోంది. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన సీనియర్లు, ఇతర ముఖ్య నేతలకు పదవుల కేటాయింపునకు సంబంధించిన తుది జాబితాను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానానికి అందజేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హస్తిన వేదికగా ఏఐసీసీ పెద్దలతో జరిగే ఈ భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవుల సస్పెన్స్ వీడే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Tahir Hussain Convicted | ఢిల్లీ అల్లర్లు : ఐబీ అధికారి హత్య కేసులో దోషిగా ఆప్ మాజీ నేత తాహిర్ హుస్సేన్
- ●Eesha Rebba | బాత్ టబ్‌లో ఈషారెబ్బా - ఒంపుసొంపులతో మతిపోగొడుతోందిగా!
- ●KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ
- ●Bhagyashri Borse | సమంత మా అందరికి ఓ దారి చూపించింది - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్...
- ●Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం
- ●Tanneru Venkatesham | నీళ్లను ఒడిసి పట్టండి.. తాగునీటికే 40 టీఎంసీలు అవసరం : తన్నీరు వెంకటేశం

Tahir Hussain Convicted | ఢిల్లీ అల్లర్లు : ఐబీ అధికారి హత్య కేసులో దోషిగా ఆప్ మాజీ నేత తాహిర్ హుస్సేన్

Eesha Rebba | బాత్ టబ్‌లో ఈషారెబ్బా - ఒంపుసొంపులతో మతిపోగొడుతోందిగా!

KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ

Bhagyashri Borse | సమంత మా అందరికి ఓ దారి చూపించింది - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్...




