Shyam Prasad Reddy | తెలంగాణ రాకముందే రిటైరయ్యాం.. మాకు అవినీతిలో భాగమేంది..? : సీఎం రేవంత్‌కు శ్యాంప్రసాద్ రెడ్డి సూటి ప్రశ్న
Shyam Prasad Reddy | కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project ) అవినీతిలో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లకు భాగం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )పై రిటైర్డ్ ఇంజినీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి( Shyam Prasad Reddy ) నిప్పులు చెరిగారు. అసలు మేం తెలంగాణ రాకముందే రిటైరయ్యాం.. మాకు అవినీతిలో భాగమేంది..? అని నిలదీశారు.
Shyam Prasad Reddy | త్రినేత్ర.న్యూస్ : కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project ) అవినీతిలో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లకు భాగం ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )పై రిటైర్డ్ ఇంజినీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి( Shyam Prasad Reddy ) నిప్పులు చెరిగారు. అసలు మేం తెలంగాణ రాకముందే రిటైరయ్యాం.. మాకు అవినీతిలో భాగమేంది..? అని నిలదీశారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్యాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
అసలు మేం తెలంగాణ రాక ముందే రిటైరయ్యాం. అవినీతిలో భాగమేంది. 2007 జూన్‌లో మేం రిటైర్ అయ్యాం. గౌరవ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి గారు, నేను. సెక్రటరీ తన్నీరు వెంకటేశం కాళేశ్వరంలో పని చేయలేదు. ఆయన హైదరాబాద్, కృష్ణా బేసిన్‌లోనే పని చేశారు. కాళేశ్వరంతో మాకు సంబంధం లేదు. కాకపోతే మా యొక్క తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రభుత్వం ఏదన్న విషయాల మీద మా అభిప్రాయాలు తెలుసుకోవడానికి పిలిస్తే చెప్పాం. అభిప్రాయాలు వింటే మంచిదే. అభిప్రాయాలు వినకపోతే లెటర్ రూపంలో ఎన్నో ఇవ్వడం జరిగింది. అందులో ఒక లెటర్‌ను సీఎం గత రెండు, మూడేండ్ల నుంచి ఖాతరు చేయలేదు. ఈ ప్రభుత్వానికి ఒక అడ్వైజ్ ఇచ్చినంతా మాత్రాన మమ్మల్ని ఒక పార్టీకి అంటగట్టి ఆ తర్వాత మమ్మల్ని జైలుకు పంపిస్తామనడం వారికే వదిలేస్తున్నాను. దాని మీద నేనేం కామెంట్ చేయదలచుకోలేదు. కాకపోతే మేం అలాంటి పనులు చేయలేదు అని శ్యాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ రోజేమో కిలాడీ గ్యాంగ్‌లో మెంబర్లం అంటే బాధ అనిపించింది
మేం ఎక్కడా కూడా అవినీతికి పాల్పడడలేదు. కాళేశ్వరంతో సంబంధం లేదు. ఫార్ములేషన్ చేసినప్పుడు మాత్రమే మేం దాని గురించి మాట్లాడడం జరిగింది. మేము ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కూడా అట్లనే ఉన్నాయి. వారితో విబేధించినప్పుడు ఆ 10 ఏండ్లలో 18 రిపోర్టులు ఇచ్చాం. ఆ 18 రిపోర్టుల్లో మీరు చూసుకున్నట్టు అయితే ఒక రిపోర్టులో ఒక వేళ థర్డ్ టీఎంసీకి 12 లైన్ల 3 మీటర్ డయా పైపుల బదులు టన్నెల్ రూపకంగా తీసుకుపోతే రూ. 8000 కోట్లు ఆదా అవుతుందని చెప్పి మేం ప్రభుత్వానికి తెలిపితే ప్రెస్‌కి ఇవ్వలేదు. 20 రోజుల తర్వాత ఆంధ్రజ్యోతిలో హెడ్‌లైన్స్‌లో వచ్చింది. అప్పుడు మేము ప్రతిపక్షాలు దీన్ని ఏమన్న పెద్దగా చేస్తాయని అనుకున్నాం. ప్రతిపక్షం కనీసం స్పందించలేదు. వారం రోజుల తర్వాత మళ్లీ కేసీఆరే మమ్మల్ని పిలిచారు. అప్పుడున్న ఈఎన్సీ వాళ్లందరికీ కూడా వీళ్లది పరిశీలించండి అని చెప్పడం జరిగింది. కేసీఆర్‌తో మేం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్న దినాలు ఉన్నాయి తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత. పాలమూరు రంగారెడ్డిని ఫైనలైజ్ చేసేటప్పుడు, డిండి ప్రాజెక్టు ఫైనల్ చేసేటప్పుడు అన్నింటి కూడా మేము ఉదయం నుంచి సాయంత్రం, రాత్రి వరకు కూర్చున్నాం. కానీ విబేధించినప్పుడు మాత్రం వారు వినకపోతే మేం పేపర్ మీద పెట్టడం ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వానికి 18 నివేదికలు ఇవ్వడం జరిగింది. వాటిని ప్రతి సంవత్సరం మా డైరీలో ప్రచురించాం. మొన్న ముఖ్యమంత్రి గారు నిన్న నాలుగు రోజుల క్రితం మేము వీరులం.. ఈ రోజేమో కిలాడీ గ్యాంగ్‌లో మెంబర్లం అంటే బాధ అనిపించింది అని రిటైర్డ్ ఇంజినీర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Shyam Prasad Reddy | జైల్లో పెట్టండి.. మేం స్వాగతిస్తున్నాం.. శ్యాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
జులై 13, 2026

BRS Leaders | 18న ఛలో సరూర్‌నగర్.. నిరుద్యోగులు దండులా తరలి రావాలి
జులై 13, 2026

Shyam Prasad Reddy | పెంటారెడ్డి మాట వినండి.. పంపులు ఆన్ చేయండి.. సీఎం రేవంత్‌కు శ్యాంప్రసాద్ రెడ్డి సూచన
జులై 13, 2026
తాజావార్తలు
- ●Shyam Prasad Reddy | జైల్లో పెట్టండి.. మేం స్వాగతిస్తున్నాం.. శ్యాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- ●BRS Leaders | 18న ఛలో సరూర్‌నగర్.. నిరుద్యోగులు దండులా తరలి రావాలి
- ●Shyam Prasad Reddy | పెంటారెడ్డి మాట వినండి.. పంపులు ఆన్ చేయండి.. సీఎం రేవంత్‌కు శ్యాంప్రసాద్ రెడ్డి సూచన
- ●Kaleshwaram Project Barrages | ఆ మూడు బ్యారేజీల్లో నీళ్లు నింపితే కొట్టుకుపోవడమే..!
- ●Shyam Prasad Reddy | లాస్ట్ మంత్ బీజేపీ ఆఫీసుకు వెళ్లాం.. మరి మేం బీజేపీనా..? : శ్యాం ప్రసాద్ రెడ్డి
- ●Jani Master | మా మధ్య గొడవలు లేవు - శేఖర్ మాస్టర్‌తో వివాదంపై జానీ మాస్టర్ కామెంట్స్

Shyam Prasad Reddy | జైల్లో పెట్టండి.. మేం స్వాగతిస్తున్నాం.. శ్యాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

BRS Leaders | 18న ఛలో సరూర్‌నగర్.. నిరుద్యోగులు దండులా తరలి రావాలి

Shyam Prasad Reddy | పెంటారెడ్డి మాట వినండి.. పంపులు ఆన్ చేయండి.. సీఎం రేవంత్‌కు శ్యాంప్రసాద్ రెడ్డి సూచన

Kaleshwaram Project Barrages | ఆ మూడు బ్యారేజీల్లో నీళ్లు నింపితే కొట్టుకుపోవడమే..!



