Shyam Prasad Reddy | 150 మీటర్లకు ఒప్పించగలిగితేనే తుమ్మడిహెట్టి దగ్గర ప్రయోజనం : శ్యాం ప్రసాద్ రెడ్డి
Shyam Prasad Reddy | తుమ్మిడిహెట్టి( Tummidihetti Barrage ) దగ్గర ప్రాజెక్టును కట్టాలనుకుంటే మహారాష్ట్ర( Maharashtra )ను 150 మీటర్లకు ఒప్పించగలిగితేనే ప్రయోజనం ఉంటుందని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్ రెడ్డి( Shyam Prasad Reddy ) స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన మేరకు 148 మీటర్ల వద్దనే ప్రాజెక్టు కట్టుకున్నట్టైతే తప్పకుండా లిఫ్ట్ చేయాలి అని ఆయన తెలిపారు.
Shyam Prasad Reddy | త్రినేత్ర.న్యూస్ : తుమ్మిడిహెట్టి( Tummidihetti Barrage ) దగ్గర ప్రాజెక్టును కట్టాలనుకుంటే మహారాష్ట్ర( Maharashtra )ను 150 మీటర్లకు ఒప్పించగలిగితేనే ప్రయోజనం ఉంటుందని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్ రెడ్డి( Shyam Prasad Reddy ) స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన మేరకు 148 మీటర్ల వద్దనే ప్రాజెక్టు కట్టుకున్నట్టైతే తప్పకుండా లిఫ్ట్ చేయాలి అని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్యాం ప్రసాద్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నిజాలు ఎలా ఉన్నప్పటికీ.. ఎవరికి అనుకూలమైనది వారు చదువుతున్నారు. మనకు తుమ్మిడిహెట్టినే మొదటి ప్రాధాన్యత. అక్కడ 150 మీటర్ల లెవల్‌కు మహారాష్ట్ర ఒప్పుకున్నట్టు అయితే ఒక్క లిఫ్ట్ ద్వారానే ఎల్లంపల్లిలో నీళ్లు పోసుకోవచ్చు. ఆల్రెడీ 70 కి.మీ. కెనాల్, స్ట్రక్చర్స్ అయినటువంటి అలైన్‌మెంట్ అది. కాబట్టి ఆ రోజు సమగ్రమైన సర్వేలు చేయని కారణంగా అటువైపు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉందన్న విషయం తెలియక ఆ సైట్‌ని ప్రపోజ్ చేయడం జరిగింది. శాంక్చురీ ఉన్నదని తెలిసిన తర్వాత సైట్‌ని కాన్‌ఫ్లయెన్స్ నుంచి వన్ అండ్ ఆఫ్ కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్‌లో ఉన్నటువంటి సైట్‌ని కాన్‌ఫ్లయెన్స్ వరకు తీసుకొచ్చారు. దాని తర్వాత ఇప్పుడు కాన్‌ఫ్లయెన్స్ నుంచి హాఫ్ కిలోమీటర్ వరకు అప్‌స్ట్రీమ్‌లో పెట్టినప్పుడు రెండు రివర్లను కలుపుతూ ఇప్పుడు బ్యారేజీ కట్టాల్సిన పరిస్థితి ఉన్నదని ఆయన తెలిపారు.
షార్ట్ ఫాల్‌కే మేడిగడ్డకు పోవాలి
అయితే మేం ఇచ్చినటువంటి లెటర్లలో కూడా ఒకవేళ మేడిగడ్డ కట్టాలనుకుంటే కట్టండి.. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం అక్కడ ఇవ్వండి.. అక్కడ్నుంచి మనకు కావాల్సినటువంటి నీళ్లు లేవని సీడబ్ల్యూసీ చెప్పిన కారణంగా ఇక్కడ మారారు అంటున్నారు కదా.. అయినా కూడా అక్కడ ఎన్ని వచ్చినా పర్వాలేదు. 160 రాదు 120 వస్తది 100 వస్తది 80 వస్తది అయినా అక్కడ్నుంచి తీసుకోండి. ఒక లిఫ్ట్ ద్వారా వచ్చే వాటర్ ను మనం వదలకూడదు. షార్ట్ ఫాల్‌కే మనం మేడిగడ్డకు పోవాలి అని క్లియర్‌గా మేం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. తప్పకుండా కడుతామని చెప్పడం జరిగింది వారు. కానీ దాని రూపాంతరం చెందిన తర్వాత వార్దా మీదనే ఒక డ్యామ్ కట్టేసి ఓన్లీ లోకలైజ్డ్ చేసి ఆదిలాబాద్ వరకు ఏదైతే మొదలు 50000 వరకే అనుకున్నారు.. తర్వాత 2 లక్షలకు దానికి పెంచి అక్కడ వార్దా మీద ఒక డ్యామ్ కట్టేసి బరాజ్ కట్టేసి 2 లక్షల వరకు ఆదిలాబాద్ వరకే పరిమితం చేస్తూ అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి ప్రాజెక్టుని అక్కడికే లిమిట్ చేయాలనేటటువంటిది అప్పటి ప్రభుత్వం ఆలోచన అని శ్యాం ప్రసాద్ రెడ్డి గుర్తు చేశారు.
మళ్లీ లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి
ఇప్పటి ప్రభుత్వం ఆలోచన ఏందంటే మళ్లా మేము తుమ్మిడిహట్టి దగ్గరనే కట్టి దాన్ని సుందిళ్లలో కలిపేసి ఒక లిఫ్ట్ ద్వారానే మేం కూడా ఎల్లంపల్లిలో వేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ ఇంత వరకు మహారాష్ట్ర 148కే వాళ్లు ఆ రోజు అంగీకరించారు. అప్పుడున్న ముఖ్యమంత్రినే ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రిగా వచ్చారు ఇప్పుడు. మొదటగా మహారాష్ట్రను కనీసం 150కి అయినా ఒప్పించగలిగితే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రయోజనం ఉంటుంది. 148 మీదనే మనం అక్కడ కట్టుకున్నట్టైతే తప్పకుండా లిఫ్ట్ చేయాలి. ఎందుకంటే కెనాల్ ఏదైతే తవ్వినమో అది 152కు ఉంటదనుకుని తవ్వినటువంటి కెనాలు. ఇప్పుడు అదే 148 అయినట్టు అయితే కెనాల్‌కు రావాలన్నప్పుడు మళ్లీ లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతదన్నట్టు కొంచెం. 15 మీటర్ల లిఫ్ట్ చేయాల్సి వస్తది. అది పొలిటికల్ నిర్ణయం. ఏదైనా టెక్నికల్‌గా ఫీజబులే. పైసలు అనుకుంటే. పొలిటికల్ నిర్ణయం తీసుకోని ఆ విధంగా చేయదలచుకుంటే చేయనివ్వండి. తుమ్మిడిహెట్టి దగ్గర ఉండాలని మేం మొదట్నుంచి చెప్తున్నాం. షార్ట్ ఫాల్ మాత్రమే మేడిగడ్డ నుంచి తీసుకోవాలనుకుంటున్నం. కాబట్టి ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర ఏదైతే ప్రపోజల్ చేస్తున్నారో దాన్ని కూడా మీరు అన్ని విధాలుగా ఆలోచించి చేయండి. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి. ఆ ప్రయత్నం చేసిన తర్వాతనే తుమ్మిడిహెట్టి దగ్గర పనులు చేస్తేనే బాగుంటుందని అనుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
148 కంటే ఒక్క ఇంచు కూడా ఒప్పుకోను
అయితే పేపర్ మీదనైతే 148కే ఉన్నది. ఆయన క్లియర్ కట్‌గా చెప్పింది ఏంటంటే నేను ఇక్కడ అరెస్టు అయ్యాను, జైలుకు పోయాను. ఇక్కడ 148 కంటే ఎక్కువ చేస్తే ఎంత మునుగుతుందని చెప్పి. కాబట్టి మీరు ఇంకా ఏ ప్రత్యామ్నాయం తీసుకొచ్చిన ఒప్పుకుంటాను. ఎక్సెప్ట్ తుమ్మిడిహెట్టి వద్ద 148 కంటే ఒక్క ఇంచు కూడా నేను ఒప్పుకోను అని కరాఖండిగా చెప్పినట్టు ఆ రోజు మేం పేపర్లలో కూడా చూశాం, చదివాం. కాబట్టి ఇప్పుడు సీఎం అంటున్నారంటే మరి లేటెస్ట్‌గా ఏం మార్పులు వచ్చాయో కూడా తెలియదు అని శ్యాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం
జులై 13, 2026

Tanneru Venkatesham | నీళ్లను ఒడిసి పట్టండి.. తాగునీటికే 40 టీఎంసీలు అవసరం : తన్నీరు వెంకటేశం
జులై 13, 2026

Revanth Reddy | చంద్రబాబుకు రేవంత్ ‘గురుదక్షిణ’.. సుప్రీంకోర్టులో బట్టబయలైన కుట్ర
జులై 13, 2026
తాజావార్తలు
- ●Bhagyashri Borse | సమంత మా అందరికి ఓ దారి చూపించింది - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్...
- ●Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం
- ●Tanneru Venkatesham | నీళ్లను ఒడిసి పట్టండి.. తాగునీటికే 40 టీఎంసీలు అవసరం : తన్నీరు వెంకటేశం
- ●Revanth Reddy | చంద్రబాబుకు రేవంత్ 'గురుదక్షిణ'.. సుప్రీంకోర్టులో బట్టబయలైన కుట్ర
- ●OU 85th Convocation | స్నాతకోత్సవం ఒక్క వేడుకే కాదు.. విద్యార్థుల విజయాల ఉత్సవం కూడా
- ●Tanneru Venkatesham | నీళ్లు కిందకు పోతున్నాయి.. పట్టిసీమ వద్ద 24 పంపులు నడుస్తున్నాయి : తన్నీరు వెంకటేశం

Bhagyashri Borse | సమంత మా అందరికి ఓ దారి చూపించింది - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్...

Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం

Tanneru Venkatesham | నీళ్లను ఒడిసి పట్టండి.. తాగునీటికే 40 టీఎంసీలు అవసరం : తన్నీరు వెంకటేశం

Revanth Reddy | చంద్రబాబుకు రేవంత్ 'గురుదక్షిణ'.. సుప్రీంకోర్టులో బట్టబయలైన కుట్ర



