TG Police | అదనపు భద్రత వెనక్కి..! డీజీపీ సీవీ ఆనంద్ అధ్యతన సమావేశంలో నిర్ణయం..!
TG Police | తెలంగాణ పోలీసు శాఖను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టాల్సిన చర్యలపై డీజీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన స్టాఫ్ ఆఫీసర్ల సమావేశం జరిగింది. శాఖకు సంబంధించిన విధానపరమైన, పరిపాలనా, సాంకేతిక అంశాలపై అధికారులు విస్తృతంగా చర్చించారు.
TG Police | తెలంగాణ పోలీసు శాఖను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టాల్సిన చర్యలపై డీజీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన స్టాఫ్ ఆఫీసర్ల సమావేశం జరిగింది. శాఖకు సంబంధించిన విధానపరమైన, పరిపాలనా, సాంకేతిక అంశాలపై అధికారులు విస్తృతంగా చర్చించారు. మావోయిస్ట్ ముప్పు నేపథ్యంలో అవసరానికి మించి కల్పించిన భద్రతను పునఃసమీక్షించి ఉపసంహరించడం, దాదాపు 400 మంది పోలీసు సిబ్బంది, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను ఇతర అవసరాలకు వినియోగించే అంశంపై సమావేశంలో చర్చించారు. ఎస్‌ఆర్‌సీ (SRC) నివేదిక అమలు, పోలీసు సిబ్బంది, వాహనాల ఆడిట్ అంశాలను కూడా సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ యూనిట్లను ఒకే క్యాంపస్ నుంచి నిర్వహించే ప్రతిపాదన, తెలంగాణ పోలీసు మాన్యువల్ తుది రూపకల్పనపై అధికారులు చర్చించారు.
ఐపీఎస్ అధికారుల యూనిఫాంలో క్రాస్ బెల్ట్‌లు, లాఠీల వంటి సంప్రదాయ అంశాల అవసరంపైనా అభిప్రాయాలను సేకరించారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బంది సమస్యలు, వాటి పరిష్కారానికి ఇతర శాఖలతో సమన్వయం, విజిలెన్స్, ఆహార కల్తీ నియంత్రణ, డ్రగ్ కంట్రోల్ వంటి విభాగాల్లో కొత్త ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థల ఏర్పాటు, ట్రాఫిక్-రోడ్డు భద్రత బ్యూరో ఏర్పాటు అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వినియోగించుకునే దిశగా టెక్నాలజీ, కంప్యూటర్ సర్వీసెస్ విభాగం ఆధునీకరణపై డీజీపీ సమీక్షించారు. సీసీటీఎన్‌ఎస్ 3.0, టీజీ-కాప్ 3.0, హాక్‌ఐ 3.0 ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. అధికారులు అందించిన సూచనలు, అభిప్రాయాలను తెలంగాణ పోలీసు శాఖ భవిష్యత్ విధానాల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటామని డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే - హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ
- ●BCCI Review | టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై చర్చించే ఛాన్స్..!
- ●Siddaramaiah | ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను : సిద్ధరామయ్య
- ●Jagtial | మల్యాలలో అమానుషం.. చితి మంటలు ఆర్పేసి బూడిద ఎత్తుకెళ్లిన దుండగులు
- ●Nirmala Sitharaman | యువతలో ఆమాత్రం స్పిరిట్ ఉండాలి : నిర్మలా సీతారామన్
- ●Ram Charan | రామ్‌చరణ్‌కు సర్జరీ - కోయంబత్తూరుకు మెగా ఫ్యామిలీ - ఆర్సీ 17 షూటింగ్ ఆలస్యం?

Mrunal Thakur | మృణాల్ తగ్గేదేలే - హిట్లు లేకపోయినా రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచిన బ్యూటీ

BCCI Review | టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌పై చర్చించే ఛాన్స్..!

Siddaramaiah | ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను : సిద్ధరామయ్య

Jagtial | మల్యాలలో అమానుషం.. చితి మంటలు ఆర్పేసి బూడిద ఎత్తుకెళ్లిన దుండగులు





