BCCI | టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా కొత్త ముఖం?.. తెరపైకి ఆ మాజీ క్రికెటర్ పేరు..!
BCCI | టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ ప్రారంభంలో ముగియనుంది. దీంతో ఆయనకే మరోసారి అవకాశం ఇస్తారా? లేక సెలక్షన్ కమిటీకి కొత్త సారథిని నియమిస్తారా? అనే చర్చ మొదలైంది.
BCCI | టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ ప్రారంభంలో ముగియనుంది. దీంతో ఆయనకే మరోసారి అవకాశం ఇస్తారా? లేక సెలక్షన్ కమిటీకి కొత్త సారథిని నియమిస్తారా? అనే చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన బీసీసీఐ 95వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో సెలక్షన్ కమిటీలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని బోర్డు కార్యవర్గానికి అసోసియేషన్లు అప్పగించాయి. దీంతో అగార్కర్ పదవీకాలం పొడిగింపుపైనా.. కొత్త చీఫ్ సెలెక్టర్ నియామకంపైనా తుది నిర్ణయం బీసీసీఐ అధికారులదే.
పార్ధివ్ పటేల్ పేరు తెరపైకి..
అగార్కర్ స్థానంలో మార్పు చేయాలని బీసీసీఐ నిర్ణయిస్తే.. మాజీ టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ పార్ధివ్ పటేల్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2026 మార్చి నుంచే అతడి పేరు చర్చకు వస్తోంది. టీమిండియాకు ఆడిన పార్ధివ్.. క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదేళ్లకు పైగానే అయింది. సెలెక్టర్ పదవికి అవసరమైన అర్హతలు అతడికి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్‌కు పార్ధివ్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సైతం గుజరాత్ జట్టులోనే ఉన్నాడు. కోచింగ్‌తో పాటు క్రికెట్ కామెంట్రీలోనూ పార్ధివ్ కొనసాగుతున్నాడు. అయితే, చీఫ్ సెలెక్టర్‌గా అతడి నియామకంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికైతే చర్చలో ఉంది.
అక్టోబర్‌తో అగార్కర్ టర్మ్ ముగింపు
2023 జూలైలో భారత పురుషుల సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా అజిత్ అగార్కర్ నియామకమయ్యాడు. శివసుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అగార్కర్ పదవీకాలం ముగింపు దశకు చేరుకోవడంతో బీసీసీఐ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ప్రస్తుత కమిటీని కొనసాగించడమా? లేక కొత్త నియామకం చేపట్టడమా? అన్నది తేలాల్సి ఉంది. సీనియర్ సెలక్షన్ కమిటీతో పాటు జూనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలో ఐదు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో రానున్న రోజుల్లో భారత క్రికెట్ ఎంపిక వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం అగార్కర్‌కు కొనసాగింపు ఉంటుందా? కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తారా? అన్నదే ఆసక్తికరంగా మారింది. మార్పు జరిగితే పార్ధివ్ పటేల్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ.. తుది నిర్ణయం మాత్రం బీసీసీఐదే.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Special Trains | పండుగలకు ఊరెళ్తున్నారా..? చర్లపల్లి–నాగర్‌కోయిల్ మధ్య ఐదు ప్రత్యేక రైళ్లు..!
- ●Mrunal Thakur | పూల గౌనులో క్యూట్ ఫొటోలతో కట్టిపడేసిన సీతారామం హీరోయిన్
- ●Deepika Padukone | రెండోసారి తల్లయిన దీపికా పడుకోణ్ - పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్
- ●Street Vendors UPI Rules | చిరు వ్యాపారుల నెత్తిన యూపీఐ పిడుగు.. రూ.1 లక్ష దాటితే మర్చంటేనా?
- ●Kodada Mega Job Mela | కోదాడలో ఉద్యోగాల సునామీ: 350 కంపెనీలు.. 32 వేల మంది అభ్యర్థులు
- ●బి-ఫామ్‌తో దానం బుక్.. కండువా ఎమ్మెల్యేల సంగతేంటి?

Special Trains | పండుగలకు ఊరెళ్తున్నారా..? చర్లపల్లి–నాగర్‌కోయిల్ మధ్య ఐదు ప్రత్యేక రైళ్లు..!

Mrunal Thakur | పూల గౌనులో క్యూట్ ఫొటోలతో కట్టిపడేసిన సీతారామం హీరోయిన్

Deepika Padukone | రెండోసారి తల్లయిన దీపికా పడుకోణ్ - పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్

Street Vendors UPI Rules | చిరు వ్యాపారుల నెత్తిన యూపీఐ పిడుగు.. రూ.1 లక్ష దాటితే మర్చంటేనా?





