Civil Supplies Department | బకాయి సీఎంఆర్ చెల్లించకుంటే ఆస్తుల జప్తు!
Civil Supplies Department | ప్రభుత్వానికి బకాయి పడిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను తిరిగి రాబట్టేందుకు పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. బియ్యం, ధాన్యం అప్పగించకుండా బకాయిలు చెల్లించని రైస్ మిల్లర్ల ఆస్తులను జప్తు చేయడంతోపాటు, అవసరమైతే మిల్లుల్లోని యంత్రాలను వేలం వేసేందుకు చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది.
- రైస్ మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ కొరడా
- ఆర్ఆర్ చట్టం కింద కఠిన చర్యలు..
- మిల్లుల్లో యంత్రాల వేలానికి సిద్ధం
- ఫిజికల్ వెరిఫికేషన్ యాప్‌తో తనిఖీలు..
- ప్రతి బుధవారం సర్‌ప్రైజ్ చెకింగ్‌లు
Civil Supplies Department | ప్రభుత్వానికి బకాయి పడిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను తిరిగి రాబట్టేందుకు పౌరసరఫరాల శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. బియ్యం, ధాన్యం అప్పగించకుండా బకాయిలు చెల్లించని రైస్ మిల్లర్ల ఆస్తులను జప్తు చేయడంతోపాటు, అవసరమైతే మిల్లుల్లోని యంత్రాలను వేలం వేసేందుకు చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల వసూళ్లే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. మిల్లర్ల అక్రమాలను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖ కొత్తగా ఫిజికల్ వెరిఫికేషన్ (పీవీ) మొబైల్ యాప్‌ను వినియోగిస్తోంది. క్షేత్రస్థాయి బృందాలు ప్రతి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నాయి. తనిఖీల సందర్భంగా సేకరించే ఆధారాలు న్యాయస్థానాల్లోనూ నిలిచేలా డిజిటల్ సాక్ష్యాలను పక్కాగా నమోదు చేయడంపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘించిన మిల్లర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ఈ విధానం దోహదపడనుంది.
అధికారులకు కమిషనర్ దిశానిర్దేశం
పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఎక్స్-అఫీషియో ముఖ్య కార్యదర్శి ఎం స్టీఫెన్ రవీంద్ర క్షేత్రస్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో దిశానిర్దేశం చేశారు. మూడు బ్యాచ్‌లుగా పాల్గొన్న డిప్యూటీ తహసీల్దార్లకు విధుల నిర్వహణపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాయతీగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం పనిచేసే అధికారులకు శాఖ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మిల్లుల్లో తనిఖీలు నిర్వహించే సమయంలో అనుసరించాల్సిన విధానాలు, డిజిటల్ ఆధారాల సేకరణ, చట్టపరమైన చర్యలకు అవసరమైన ప్రక్రియలపై అధికారులకు అవగాహన కల్పించారు. శిక్షణ పూర్తయిన వెంటనే ప్రాక్టికల్ మాక్ టెస్టులు నిర్వహించి వారి సామర్థ్యాన్ని పరీక్షించారు. తద్వారా క్షేత్రస్థాయిలో తనిఖీలను మరింత సమర్థంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారు.
బకాయిల వసూళ్లే లక్ష్యం
ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ బియ్యం లేదా ధాన్యాన్ని అప్పగించకుండా బకాయిలు పెండింగ్‌లో ఉంచిన మిల్లర్ల నుంచి వసూళ్లకు పౌరసరఫరాల శాఖ ప్రాధాన్యమిస్తోంది. బకాయిలను బియ్యం, ధాన్యం లేదా నగదు రూపంలో తిరిగి రాబట్టేందుకు చర్యలు చేపట్టనుంది. ఆర్ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తు, యంత్రాల వేలం వంటి చర్యలకు ఉపక్రమించనుంది. తదుపరి దశలో జిల్లా పౌరసరఫరాల అధికారులు (డీసీఎస్‌వోలు), జిల్లా మేనేజర్లకు (డీఎంలు) సైతం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన బకాయిల వసూళ్లలో జాప్యానికి తావులేకుండా, నిబంధనలు ఉల్లంఘించే మిల్లర్లపై వేగంగా చట్టపరమైన చర్యలు తీసుకునేలా శాఖ కార్యాచరణ రూపొందించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rajanna Sircilla | రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీకి కొత్త పాలకవర్గం
- ●Aafia Sayed | నితిన్ అలియాస్ రుక్మిణికి హీరోయిన్ దొరికిందోచ్ - బాలీవుడ్ బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా!
- ●Rahul Gandhi | న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: రాహుల్ గాంధీ
- ●Abhijeet Dipke Hingoli | ఓటర్లకు చెప్పినట్లే మోదీకి సుప్రీంకోర్టు చెప్పగలదా?
- ●Telugu Serial Actress | విడాకులు తీసుకున్న అగ్నిసాక్షి సీరియల్ హీరోయిన్
- ●Obstruction of Dalits | ఈ గుడి మేం కట్టించాం.. మీరెలా వస్తారు.. దళితులను అడ్డుకున్న ఎమ్మెల్యే మేనమామ

Rajanna Sircilla | రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీకి కొత్త పాలకవర్గం

Aafia Sayed | నితిన్ అలియాస్ రుక్మిణికి హీరోయిన్ దొరికిందోచ్ - బాలీవుడ్ బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా!

Rahul Gandhi | న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: రాహుల్ గాంధీ

Abhijeet Dipke Hingoli | ఓటర్లకు చెప్పినట్లే మోదీకి సుప్రీంకోర్టు చెప్పగలదా?




