త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pending Bills | ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. పెండింగ్ బిల్లులు రూ.720 కోట్లు విడుదల

Pending Bills | ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపిక‌బురు అందించింది. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు పెండింగ్‌లో (Pending Bills) ఉన్న‌ సరెండర్ లీవుల ఎన్‌క్యాష్‌మెంట్ మొత్తాన్ని ఒకేసారి విడుద‌ల చేసింది.

G

Telangana | Published On Feb 1, 2026, 11.17 am IST

Pending Bills | ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. పెండింగ్ బిల్లులు రూ.720 కోట్లు విడుదల
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపిక‌బురు అందించింది. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు పెండింగ్‌లో (Pending Bills) ఉన్న‌ సరెండర్ లీవుల ఎన్‌క్యాష్‌మెంట్ మొత్తాన్ని ఒకేసారి విడుద‌ల చేసింది.

ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్క‌టిగా అమలు చేస్తూ వస్తున్న‌ది. ఇందులో భాగంగా ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రభుత్వం గ్రీన్ చానల్‌లో పెండింగ్ నిధులను నెలవారీగా విడుదల చేస్తూ వస్తుంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం రూ. 720 కోట్లు విడుదల చేసింది. జనవరి మాసానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం రూ. 720 కోట్లు విడుదల చేశారు. గత ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రతి నెల రూ.700 కోట్లకుపైగా నిధులు విడుదల చేస్తామని ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. గతేడాది జూన్ నెలాఖరులో రూ.183 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత గత సంవత్సరం ఆగస్టు నుంచి ప్రతి నెల కనీసంగా రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తున్న‌ది. తాజాగా విడుదల చేసిన నిధులలో 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీవుల ఎన్ క్యాష్‌మెంట్‌ పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ చేసింది. వీటితోపాటు విడుదలైన బిల్లులో గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవులు, అడ్వాన్సులు కూడా ఉన్నాయి.

Advertisement
Advertisement