PRC | జూన్ 2 నాటికి ‘పీఆర్సీ’ ప్రకటించాల్సిందే.. రేవంత్ సర్కార్‌కు ఉద్యోగుల అల్టిమేటం
PRC | ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి జూన్ 2 వరకు డెడ్ లైన్ విధిస్తున్నామని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. పెండింగులో ఉన్న 5 డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరింది.
రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు వెంటనే క్లియర్ చేయండి
హెల్త్ కార్డ్స్‌ను తక్షణమే జారీ చేయండి
సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించండి
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భద్రత కోసం
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ఏప్రిల్ 17న తహసీల్దార్లకు మెమోరాండం
మే 5న కలెక్టర్లకు వినతిపత్రం అందజేత
తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానాలు
వివరాలు ప్రకటించిన చైర్మన్ లచ్చిరెడ్డి
PRC | త్రినేత్ర.న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి జూన్ 2 వరకు డెడ్ లైన్ విధిస్తున్నామని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. పెండింగులో ఉన్న 5 డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరింది. శుక్రవారం తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈ జేఏసీ) విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పరిష్కార మార్గాలపై జేఏసీ భాగస్వామ్య సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా టీజీఈ జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ రాజశేఖర్ మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ జారీ చేసి తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు చేసి ఓపీఎస్(ఓల్డ్ పెన్షన్ స్కీం) విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసుల ఉద్యోగ నియామక సమస్యను సత్వరం పరిష్కరించాలని కోరారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ ప్రత్యక్ష కార్యాచరణ
త్వరలో జనాభా లెక్కల కార్యక్రమం ఉన్నందున ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సాధారణ బదిలీలు చేపట్టాలని టీజీఈజేసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్ల సాధన కోసం పోరాట కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 17న మండల,డివిజన్ కేంద్రాల్లో భోజన విరామ సమయంలో తహసీల్దార్లకు మెమోరాండంలు ఇస్తామని తెలిపారు. మే 5న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయడంతో పాటు ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యతను తీసుకుంటామని వివరించారు.
జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో టీజీఈ జేఏసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఓడనాల రాజశేఖర్, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ కె. రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. రాములు, జనరల్ సెక్రటరీ రమేష్ పాక, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బాణాల రాంరెడ్డి, టీజీఆర్ఎస్ఏ ఉపాధ్యక్షులు భిక్షం, రాష్ట్ర కోశాధికారి మల్లేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, తెలంగాణ ప్రాంత ఉద్యోగ సంఘం అధ్యక్షులు కె. హన్మంత రావు, తెలంగాణ కమర్షియల్ టాక్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవేందర్ పాల్గొన్నారు.
తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జీ.కృపాకర్, తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె.రాములు, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు డా.జి. నిర్మల, తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అశ్వత్థామ రెడ్డి, తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయిస్ అధ్యక్ష, కార్యదర్శి దర్శన్ గౌడ్, ఉపేందర్ రావు, తెలంగాణ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు ఎన్ రాబర్ట్ బ్రూస్, తెలంగాణ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ అధ్యక్షులు డా.కత్తి జనార్దన్, తెలంగాణ డీజేబుల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు హాబీబ్ మస్తాన్, తెలంగాణ జీపీవో అసోసియేషన్ అధ్యక్షులు గరికే ఉపేందర్ రావు, తెలంగాణ జ్యూడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. వీ. సుభాష్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి హాజరయ్యారు.
జీహెచ్ఎంసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఉద్దరి గోపాల్, తెలంగాణ డివిజనల్ అకౌంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సీహెచ్.రవి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అధ్యక్షులు ఎస్.నర్సింహులు, తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఫిమేల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు రొక్కం దేవిక, తెలంగాణ ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బి. సుదర్శన్ గౌడ్, టీజీబీసీ ఉపాద్యాయ సంఘం ఎం.చంద్రశేఖర్ గౌడ్, ఎస్సి,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కొంగల వెంకట్, తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కె.సాయిరెడ్డి, తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు పి. లక్ష్మయ్య ఉన్నారు.
రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ అధ్యక్షులు ఎస్. నర్సింహులు, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ టీచర్, లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆవుల శ్రీధర్, ప్రైమరీ స్కూల్ టీచర్స్ యూనియన్ అధ్యక్షులు శిరందాస్ రాందాస్, తెలంగాణ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు డా.రామకృష్ణ, ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరికృష్ణ, తెలంగాణ ఎస్సీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు సందీప్ కుమార్, మైనార్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండీ మొయినుద్దీన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ బీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్, తెలంగాణ లాంగ్వేజ్ కల్చరర్ డిపార్టుమెంట్ అసోసియేషన్ అధ్యక్షులు హేమలత, తెలంగాణ సీడ్ కార్పొరేషన్ అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ కుమార్, హెచ్.ఎమ్.డబ్ల్యూ.ఎస్. అండ్ ఎస్.బీ.ఈ.డబ్ల్యూ.ఏ. అధ్యక్షులు సుగంధిని, స్పోస్ ఫోరమ్ అధ్యక్షులు వివేక్ తో పాటు అనేక సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



