త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yadagirigutta Trust Board | యాదగిరిగుట్ట దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు.. చైర్మన్‌గా సత్యనారాయణ రెడ్డి

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి కొత్త పాలకమండలిని (ట్రస్ట్ బోర్డ్) రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

J

Nalgonda | Published On Jun 30, 2026, 9.45 pm IST

Yadagirigutta Trust Board | యాదగిరిగుట్ట దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు.. చైర్మన్‌గా సత్యనారాయణ రెడ్డి
Advertisement
  • యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతన ట్రస్ట్ బోర్డును ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
  • బోర్డు చైర్మన్‌గా ఎం. సత్యనారాయణ రెడ్డి నియామకం
  • ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ సహా మరో 10 మందికి సభ్యులుగా అవకాశం
  • ఎక్స్-అఫీషియో సభ్యులు మినహా.. రెండేళ్ల పాటు కొనసాగనున్న కొత్త పాలకమండలి పదవీకాలం

Yadagirigutta Trust Board | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలకమండలిని (Trust Board) రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం (జూన్ 30, 2026) ప్రకటించింది. చైర్మన్‌, సభ్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ (Endowments Department) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

చైర్మన్, సభ్యులు వీరే..

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ జారీ చేసిన జీవో (G.O.Rt.No.392) ప్రకారం.. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు చైర్మన్‌గా ఎం.సత్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. బోర్డులో ఆయనతో పాటు మరో 10 మందిని సభ్యులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది.

సభ్యుల జాబితాలో ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలప్పగారి విజయరాజం, విజయేందర్ తుల్లా, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కంతమణి, ఎం. రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, ఫౌండర్ ట్రస్టీ ఉన్నారు.

వీరితో పాటు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (CS), దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, వైటీడీఏ (YTDA) వైస్ చైర్మన్, దేవస్థానం ఈవో,  స్థానాచార్యులు (ప్రధాన అర్చకులు) తదితరులు ఎక్స్-అఫీషియో (Ex-officio) సభ్యులుగా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పదవీకాలం.. ప్రమాణస్వీకారం

కొత్తగా నియమితులైన ఈ పాలకమండలి (ఎక్స్-అఫీషియో సభ్యులు, ఫౌండర్ ట్రస్టీ మినహాయించి) పదవీకాలం నియామక తేదీ నుంచి రెండేళ్ల పాటు (2 years) ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. చైర్మన్, ఇతర సభ్యులతో తక్షణమే ప్రమాణస్వీకారం (Oath) చేయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని యాదగిరిగుట్ట ఈవోను ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement
Advertisement