త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | ఎల్ నినో ఎఫెక్ట్.. ఉమ్మ‌డి జిల్లాల‌కు స్పెష‌ల్ ఆఫీస‌ర్ల నియామ‌కం

Telangana | రాష్ట్రంలో ఎల్ నినో ఎఫెక్ట్ కార‌ణంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సాగునీటి స‌మ‌స్య‌తో పాటు తాగునీటి ఎద్ద‌డిని నివారించేందుకు ఉమ్మ‌డి జిల్లాల‌కు స్పెష‌ల్ ఆఫీస‌ర్ల‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

S

Telangana | Published On Jul 19, 2026, 6.43 pm IST

Telangana | ఎల్ నినో ఎఫెక్ట్.. ఉమ్మ‌డి జిల్లాల‌కు స్పెష‌ల్ ఆఫీస‌ర్ల నియామ‌కం
Advertisement

Telangana | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఎల్ నినో ఎఫెక్ట్ కార‌ణంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సాగునీటి స‌మ‌స్య‌తో పాటు తాగునీటి ఎద్ద‌డిని నివారించేందుకు ఉమ్మ‌డి జిల్లాల‌కు స్పెష‌ల్ ఆఫీస‌ర్ల‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు. రిజ‌ర్వాయ‌ర్ల‌లో ఉన్న వాట‌ర్ లెవ‌ల్స్, గ్రౌండ్ వాట‌ర్ లెవ‌ల్స్‌తో పాటు తాగునీటి ల‌భ్యత, పంట‌ల ప‌రిస్థితితో పాటు హార్టిక‌ల్చ‌ర్, విద్యుత్ స‌ర‌ఫ‌రాపై ప్ర‌త్యేక అధికారులు స‌మీక్ష చేయ‌నున్నారు. ఇక ప్ర‌త్యేక అధికారులు త‌మ‌కు కేటాయించిన ఉమ్మ‌డి జిల్లాల‌ను ఈ నెల 20వ తేదీన విజిట్ చేయాల‌ని, జిల్లా ఇంచార్జి మంత్రులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదేశించారు. ఈ స‌మావేశం అనంత‌రం రాష్ట్ర‌స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న జ‌రిగే భేటీలో నివేదిక‌ను అందించాల‌ని ఆయ‌న ఆదేశించారు.

ప్ర‌త్యేక అధికారులు వీరే..

హైద‌రాబాద్ - జ‌యేశ్ రంజ‌న్
రంగారెడ్డి - వికాస్ రాజ్
క‌రీంన‌గ‌ర్ - మ‌హేశ్ ద‌త్ ఎక్కా
మెద‌క్ - వాణి ప్ర‌సాద్
నిజామాబాద్ - యోగిత రాణా
న‌ల్ల‌గొండ - హ‌రిచంద‌న దాస‌రి
ఆదిలాబాద్ - ఇలంబ‌ర్తి
వ‌రంగ‌ల్ - శ్రీదేవ‌సేన‌
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ - వీపీ గౌత‌మ్
ఖ‌మ్మం - అనుదీప్ దురిశెట్టి

Advertisement
Advertisement