El Niño | తెలంగాణ 23 జిల్లాల్లో కరువు పరిస్థితులు
El Niño | రాష్ట్రంలో ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసి, వ్యవసాయం అనుబంధ రంగాలకు రాష్ట్రస్థాయి అత్యవసర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన 27 మంది సభ్యుల నిపుణుల కమిటీ తొలి సమావేశం బుధవారం ప్రజాభవన్‌లో జరిగింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జీ చిన్నారెడ్డి అధ్యక్షతన భేటీ జరిగింది.
- ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
- ఎల్‌నినో ప్రభావంపై రాష్ట్ర నిపుణుల కమిటీ తొలి సమావేశం
El Niño | రాష్ట్రంలో ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేసి, వ్యవసాయం అనుబంధ రంగాలకు రాష్ట్రస్థాయి అత్యవసర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన 27 మంది సభ్యుల నిపుణుల కమిటీ తొలి సమావేశం బుధవారం ప్రజాభవన్‌లో జరిగింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జీ చిన్నారెడ్డి అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ కమిటీలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ), ఇక్రిశాట్, ఐసీఏఆర్-క్రిడా, నాబార్డ్, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు, భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్), నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐఓఆర్), మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్, జాతీయ విత్తన సంస్థ, తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థతో పాటు పలు పరిశోధనా, ప్రభుత్వ సంస్థల నిపుణులు సభ్యులుగా ఉన్నారు.
ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా ఎల్‌నినో కారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం వాతావరణశాఖ అంచనా వేసింది.. అయినా పలుచోట్ల సాధారణ వర్షాలు కురుస్తాయని చాలామంది భావించారని భావించారన్నారు. రాష్ట్రంలో జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు సగటున 30శాతం వరకు లోటు నమోదైందని చెప్పారు. పది జిల్లాల్లో సాధారణ వర్షాపాతం నమోదు కాగా.. 23 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని వెల్లడించారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలు, మండలాల వారీగా వాతావరణ పరిస్థితులు, వర్షాపాతం, పంటల సాగు విస్తీర్ణానికి సంబంధించిన వివరాలను సేకరించి శాస్త్రీయంగా విశ్లేషిస్తున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు. ఈ నెల 17న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే దాని ప్రభావం మానవాళిపై పడుతుందన్న ఆయన.. సహజ వనరులను బాధ్యతాయుతంగా వినియోగించుకోవడం, నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడడం అవసరమన్నారు. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల్లో అవగాహన, భాగస్వామ్యం కీలకమన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



