PM-DDKY | ధన్ ధాన్య కృషి యోజనలో తెలంగాణ జిల్లాలకు జాతీయ గుర్తింపు
PM-DDKY | ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన (పీఎం-డీడీకేవై) అమలులో తెలంగాణలోని నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ (ఎన్‌ఏఎస్‌సీ)లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అధికారులు జిల్లాలకు అవార్డులు అందజేశారు.
Nagarkurnool and Narayanpet Districts Felicitated at National Event Marking One Year of PM Dhan-Dhaanya Krishi Yojana
- మెరుగైన పాలనలో నాగర్‌కర్నూల్ దక్కిన అవార్డు
- వ్యవసాయ రుణాల కల్పనలో నారాయణపేటకు ..
PM-DDKY | ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన (పీఎం-డీడీకేవై) అమలులో తెలంగాణలోని నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ (ఎన్‌ఏఎస్‌సీ)లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అధికారులు జిల్లాలకు అవార్డులు అందజేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా మెరుగైన పాలన, ప్రజలకు సేవల అందించడంలో చేసిన కృషికి అవార్డు దక్కింది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు రైతులకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో చేసిన కృషికి నారాయణపేట జిల్లాను గుర్తించారు. నాగర్‌కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, నారాయణపేట కలెక్టర్ చెక్కా ప్రియాంక ఆయా జిల్లాల తరఫున అవార్డులు అందుకున్నారు.
పథకం లక్ష్యాలివీ..
పీఎం ధన్ ధాన్య కృషి యోజనను కేంద్ర ప్రభుత్వం 2025 అక్టోబర్ 11న ప్రారంభించింది. 2025–26 నుంచి ఆరేళ్లపాటు అమలు చేయనున్న ఈ పథకం కింద దేశవ్యాప్తంగా తక్కువ వ్యవసాయ ఉత్పాదకత, తక్కువ పంటల సాగు తీవ్రత, వ్యవసాయ రుణాల పంపిణీ తక్కువగా ఉన్న 100 జిల్లాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 11 కేంద్ర శాఖలకు చెందిన 36 పథకాలను సమన్వయం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యానికీ ప్రాధాన్యమిస్తారు. ఈ పథకం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెంపు, పంటల వైవిధ్యీకరణ, సుస్థిర వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహం, సాగునీటి సదుపాయాల మెరుగుదల, పంట కోత అనంతర నిల్వ సామర్థ్యం పెంపు, స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల లభ్యతను మెరుగుపరచాలని లక్ష్యంగా నిర్దేశించారు. తెలంగాణలో నాగర్‌కర్నూల్, నారాయణపేటతోపాటు జోగులాంబ గద్వాల, జనగామ జిల్లాల్లో ఈ పథకం అమలవుతోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Gaddam Prasad | తెలంగాణ–హిరోషిమా మధ్య సహకారం పెరగాలి
- ●Harish Rao | కరువు కోరల్లో తెలంగాణ.. పట్టింపు లేని తనంతో కాంగ్రెస్ సర్కార్
- ●Acer Iconia Tab 11 5G | ఏసర్ నుంచి రెండు కొత్త 5జి ట్యాబ్లెట్లు.. ధరలు రూ.23,999 నుంచే..
- ●Meenakshi Chaudhary | టాలీవుడ్లో కొత్త కాంబో సెట్ - నితిన్ సరసన మీనాక్షి
- ●Ramchandar Rao | టైం మీరే చెప్పండి.. 10 మందిని తీసుకురండి చాలు
- ●Srikanth Daughter | టాలీవుడ్లోకి మరో వారసురాలు - టీనేజ్ లవ్‌స్టోరీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న శ్రీకాంత్ కూతురు

Gaddam Prasad | తెలంగాణ–హిరోషిమా మధ్య సహకారం పెరగాలి

Harish Rao | కరువు కోరల్లో తెలంగాణ.. పట్టింపు లేని తనంతో కాంగ్రెస్ సర్కార్
Acer Iconia Tab 11 5G | ఏసర్ నుంచి రెండు కొత్త 5జి ట్యాబ్లెట్లు.. ధరలు రూ.23,999 నుంచే..

Meenakshi Chaudhary | టాలీవుడ్లో కొత్త కాంబో సెట్ - నితిన్ సరసన మీనాక్షి




