త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG Gas | ఒకే రోజు 2.35ల‌క్ష‌ల సిలిండ‌ర్ల డెలివ‌రీ.. వెల్ల‌డించిన పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ‌..!

LPG Gas | తెలంగాణ‌లో ఎల్‌పీజీ సిలిండ‌ర్ల కొర‌త లేద‌ని పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ ఓ ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. రాష్ట్రంలో మంగ‌ళ‌వారం ఒకే రోజు 2,35,678 సిలిండ‌ర్ల‌ను డెలివ‌రీ చేసిన‌ట్లు తెలిపింది.

P

Telangana | Published On Mar 18, 2026, 5.49 pm IST

LPG Gas | ఒకే రోజు 2.35ల‌క్ష‌ల సిలిండ‌ర్ల డెలివ‌రీ.. వెల్ల‌డించిన పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ‌..!
Advertisement

LPG Gas | తెలంగాణ‌లో ఎల్‌పీజీ సిలిండ‌ర్ల కొర‌త లేద‌ని పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ ఓ ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేసింది. రాష్ట్రంలో మంగ‌ళ‌వారం ఒకే రోజు 2,35,678 సిలిండ‌ర్ల‌ను డెలివ‌రీ చేసిన‌ట్లు తెలిపింది. గ్యాస్ సిలిండ‌ర్ రీ ఫిల్లింగ్ కోసం ఆందోళ‌న చెందొద్ద‌ని వినియోగ‌దారుల‌కు ప్ర‌భుత్వం సూచించింది. సిలిండర్ల డెలివరిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప‌ర్య‌వేక్షించేందుకు పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన క‌మాండ్ కంట్రోల్‌లో అధికారుల‌తో పాటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, కంపెనీల ప్రతినిధులు ఉన్నార‌ని తెలిపింది. ఈ మూడు కంపెనీలు కలిపి సగటున రోజుకు 2,15,151 సిలిండర్లు డెలివరీ చేసేవ‌ని, నిన్న అంతకు మించి డోర్ డెలివ‌రీ చేసింద‌ని వివ‌రించారు. ఇండియ‌న్ ఆయిల్ 93,887, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ 84,156, బీపీసీఎల్ 57,635 డెలివ‌రీ చేశాయ‌ని పౌర స‌ర‌ఫ‌రాల‌శాఖ పేర్కొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement