త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Cabinet | రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

Telangana Cabinet | ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి మంత్రుల‌తో పాటు ఉన్న‌తాధికారులు హాజ‌రు కానున్నారు.

S

Telangana | Published On Apr 22, 2026, 3.34 pm IST

Telangana Cabinet | రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
Advertisement

Telangana Cabinet | త్రినేత్ర‌.న్యూస్ : ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి మంత్రుల‌తో పాటు ఉన్న‌తాధికారులు హాజ‌రు కానున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రేపు కేబినెట్‌లో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. కేబినెట్ సూచ‌న‌ల‌తో ప్ర‌భుత్వం ముంద‌డుగు వేసే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

అస‌లేం జ‌రిగిందంటే..?

జ‌స్టిస్ పీసీ ఘోష్ క‌మిష‌న్ నివేదిక అంశంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్‌ రావుకు (Harish Rao) ఊర‌ట ల‌భించింది. పీసీ ఘోష్‌ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని హైకోర్టు (High Court) ఆదేశించింది. క‌మిష‌న్ ఎలాంటి నిబంధ‌ను పాటించ‌లేద‌ని పేర్కొంటూ రిపోర్టును నిలిపివేసింది. అదే సమయంలో కమిషన్‌ నియామకం చట్టబద్దమే అని స్పష్టం చేసింది. కాళేశ్వ‌రం నిర్మాణంలో అవ‌క‌త‌వ‌లు జ‌రిగాయ‌ని పీసీ ఘోష్ క‌మిష‌న్ నివేదిక ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై కేసీఆర్‌, హరీశ్ రావు, ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్, ఐఏఎస్‌ మాజీ అధికారి ఎస్‌కే జోషి విడివిడిగా హైకోర్టును ఆశ్ర‌యించారు. వారి పిటిషన్లపై సుదీర్ఘ విచారణ చేప‌ట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం తాజాగా తుది తీర్పును వెల్లడించింది.

కాళేశ్వరం అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమిస్తూ 2024 మార్చి 14న‌ ప్రభుత్వం జీవో 6ను విడుద‌ల చేసింది. అయితే కమిషన్ చేపట్టిన విచారణ ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని, తమపై అభియోగాలు మోపే ముందు, తమ వాదనలను కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని పిటిష‌న‌ర్లు ఆరోపించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా విచారణ సాగిందని కోర్టుకు విన్నవించారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్‌ వేశామంటూ మరొకరి పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం సరికాదన్నారు.

మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్‌ వేసినట్లు తెలిపారు. జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదిక రికార్డుల ఆధారంగానే ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా పిటిషనర్లతోపాటు పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిందని.. కాబట్టి పిటిషన్‌లను కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధ‌ర్మాస‌నం మార్చి 12న తీర్పును వాయిదా వేసింది. అయితే ఏప్రిల్ 8న‌ తీర్పు వెళ్ల‌డించాల్సి ఉండ‌గా.. ఈ నెల‌ 22కు వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. తాజాగా క‌మిష‌న్ నివేదిక ఆధారంగా కేసీఆర్‌, హ‌రీశ్ రావుపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకొవ‌ద్దంటూ తీర్పును వెలువ‌రించింది.

Advertisement
Advertisement