Telangana Budget | ‘భట్టి’ బడ్జెట్ @ రూ. 3.26 లక్షల కోట్లు..! ఆ మూడు రంగాలకే పెద్దపీట..!!
Telangana Budget | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. 20న మధ్యాహ్నం 12 గంటలకు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
Telangana Budget | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. 20న మధ్యాహ్నం 12 గంటలకు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3.26 లక్షల కోట్ల పరిమాణంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. 2025-26 వార్షిక బడ్జెట్ రూ. 3,04,965 కోట్లు కాగా, 2024-25 వార్షిక బడ్జెట్ రూ. 2,91,159 లక్షల కోట్లు.
అయితే ఈసారి ప్రధానంగా మూడు రంగాలపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేసినట్లు సమాచారం. సంక్షేమం, వ్యవసాయం, సాగునీటి రంగంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. బడ్జెట్‌లో కూడా ఈ మూడు రంగాలకే అధిక కేటాయింపులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు రంగాలతో పాటు పంచాయతీరాజ్, ఆరోగ్యం, రహదారులు, మున్సిపల్, ఐటీ రంగాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ విజన్ 2047 అమలుకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు సమాచారం.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తి అయిన నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా సంక్షేమం, సన్న బియ్యం కోసం భారీగా నిధులు కేటాయించేందుకు సర్కార్ రెడీ అయినట్లు సమాచారం.
రేపు మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్
2026 -27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను 20న మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే కంటే ముందు.. ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం శాసనసభ, మండలి వాయిదా పడనున్నాయి. శనివారం రంజాన్, ఆదివారం సెలవు కావడంతో ఆ రెండు రోజులు ఉభయ సభలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. 30వ తేదీ వరకు సభ కొనసాగనుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

Revanth Reddy | కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీసు శాఖ సిద్ధం కావాలి: సీఎం రేవంత్
మే 21, 2026

CM Revanth Reddy | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. కీలక సూచనలు చేసిన సీఎం రేవంత్
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



