త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Assembly | త‌ల్లిదండ్రుల సంర‌క్ష‌ణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Telangana Assembly | త‌ల్లిదండ్రుల సంర‌క్ష‌ణ ఉద్యోగుల బాధ్య‌త బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. త‌ల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతం నుంచి 15 శాతం కోత విధించి.. ఉద్యోగి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసేలా చట్టం తీసుకువ‌చ్చారు.

S

Telangana | Published On Mar 29, 2026, 4.33 pm IST

Telangana Assembly | త‌ల్లిదండ్రుల సంర‌క్ష‌ణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Advertisement

Telangana Assembly | త్రినేత్ర‌.న్యూస్ : త‌ల్లిదండ్రుల సంర‌క్ష‌ణ ఉద్యోగుల బాధ్య‌త బిల్లుకు శాస‌న‌స‌భ ఆమోదం తెలిపింది. త‌ల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతం నుంచి 15 శాతం కోత విధించి.. ఉద్యోగి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసేలా చట్టం తీసుకువ‌చ్చారు. తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026కు ఆమోదం సంద‌ర్భంగా శాస‌న‌స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

పిల్ల‌ల కోసం త‌ల్లిదండ్రులు త‌మ శ‌క్తినంతా ధార‌పోస్తారు. పిల్ల‌లు మాత్రం రెక్క‌లు వ‌చ్చాక త‌ల్లిదండ్రుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. వృద్ధ త‌ల్లిదండ్రుల‌కు అండ‌గా నిల‌వాల‌నే చ‌ట్టం తీసుకొచ్చాం. వృద్ధుల కోసం కేంద్రం 2007లో ఒక చ‌ట్టం తెచ్చింది. కేంద్ర చ‌ట్టం ప్ర‌కారం త‌ల్లిదండ్రుల‌కు రూ. 10 వేల‌కు మించి ఇచ్చే అవ‌కాశం లేదు. స‌మాజం త‌ల దించుకునేలా కొంద‌రు పిల్ల‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆత్మీయ‌త‌కు సంబంధించిన అంశంపై చ‌ట్టం తీసుకురావ‌డం బాధాక‌రం. త‌ల్లిదండ్రుల యోగ‌క్షేమాలు చూడ‌ని వ్య‌క్తిని సామాజికంగా బ‌హిష్క‌రించాలి. త‌ల్లిదండ్రుల‌ను చూసుకోలేనోడు స‌మాజంలో బ‌త‌క‌డానికి వీల్లేదు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కే కాదు.. ప్ర‌జాప్ర‌తినిధుల‌కు కూడా చ‌ట్టం వ‌ర్తిస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement