త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gandhi Bhavan | తెలంగాణ ఉద్య‌మ‌కారుల భిక్షాట‌న‌.. గాంధీ భవన్‌ వద్ద ఉద్రిక్తత‌

Gandhi Bhavan | తెలంగాణ ఉద్య‌మ‌కారులు మెరుపు నిర‌స‌న‌కు దిగారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌ (Gandhi Bhavan) వద్ద తీవ్ర‌ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

G

Telangana | Published On Apr 30, 2026, 12.44 pm IST

Gandhi Bhavan | తెలంగాణ ఉద్య‌మ‌కారుల భిక్షాట‌న‌.. గాంధీ భవన్‌ వద్ద ఉద్రిక్తత‌
Advertisement

Gandhi Bhavan | త్రినేత్ర‌.న్యూస్‌: తెలంగాణ ఉద్య‌మ‌కారులు మెరుపు నిర‌స‌న‌కు దిగారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీ భవన్‌ (Gandhi Bhavan) వద్ద తీవ్ర‌ ఉద్రిక్తత చోటుచేసుకుంది. భిక్షాట‌న చేస్తూ గాంధీ భ‌వ‌న్‌లోకి చొచ్చుకెళ్లేందుకు య‌త్నించారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు వారిని అడ్డుకుని అక్క‌డి నుంచి త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో ఇరు ప‌క్షాల మ‌ధ్య తోపులాట‌, వాగ్వాదం చోటుచేసుకున్న‌ది.

బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని, తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చార‌ని ఉద్య‌మ‌కారులు గుర్తుచేశారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి రెండున్న‌రేండ్లు అవుతున్న‌ప్ప‌టికీ ఆ హామీని ఇంకా నెరవేర్చలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గాంధీ భవన్‌ వద్ద చిప్పలు చేతబట్టి భిక్షాటన చేశారు.

Advertisement
Advertisement