Wrestling | 24న తెలంగాణ కేసరి కుస్తీ పోటీలు.. ఎక్కడంటే..?
Wrestling | త్రినేత్ర.న్యూస్ : కేసరి కుస్తీ పోటీలు.. అదేనండి మల్లయుద్ధ పోటీలు. ఈ పోటీలకు తెలంగాణ భవన్ వేదిక కానుంది. జూలై 24వ తేదీన తెలంగాణ కేసరి కుస్తీ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో మల్లయుద్ధ పోటీల ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మాజీ మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు.

5 వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కుస్తీ పోటీలను ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. కుస్తీ పోటీలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికైన వారికి తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రాక్, షూస్, ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలను అందిస్తామన్నారు. నగరంలోని 70 అఖాడాలు (వ్యాయామశాల)కు కుస్తీ పోటీల ప్రాక్టీస్‌కు అవసరమైన మ్యాట్‌లను అందజేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెజ్లర్‌లపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Minister Uttam | తప్పుడు ప్రచారం మానుకోవాలి: హరీశ్‌రావుపై మంత్రి ఉత్తమ్ ఫైర్
- ●టెలికాం కంపెనీల ‘నెట్’వర్క్ ఆటలకు ట్రాయ్ చెక్!
- ●Ponguleti Srinivasa Reddy | 22ఏ భూములపై కీలక ఆదేశాలు.. అర్హులకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన మంత్రి పొంగులేటి
- ●Samyuktha | ‘రాపో23’లో సంయుక్త.. మళ్లీ పుంజుకునేనా?
- ●సింగరేణి మనుగడకు పెను సవాళ్లు: రికార్డు బొగ్గు ఉత్పత్తి వెనుక కోల్ ఎక్స్ఛేంజ్ పోటీ మరియు డిజిటల్ విప్లవం!
- ●Chirumarthy Lingaiah | కాంగ్రెస్‌ను డస్ట్ బిన్లో వేసేందుకు ప్రజలు రెడీగా ఉన్నరు

Minister Uttam | తప్పుడు ప్రచారం మానుకోవాలి: హరీశ్‌రావుపై మంత్రి ఉత్తమ్ ఫైర్

టెలికాం కంపెనీల ‘నెట్’వర్క్ ఆటలకు ట్రాయ్ చెక్!

Ponguleti Srinivasa Reddy | 22ఏ భూములపై కీలక ఆదేశాలు.. అర్హులకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన మంత్రి పొంగులేటి

Samyuktha | ‘రాపో23’లో సంయుక్త.. మళ్లీ పుంజుకునేనా?





