G Jgadeesh Reddy | కాంగ్రెస్, బీజేపీ నాటకం బయటపడింది
G Jgadeesh Reddy | తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆడుతున్న నాటకం బయటపడిందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై కేంద్ర జల సంఘం నివేదికను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు.
- జలసంఘం నివేదికను అడ్డుపెట్టుకొని రాజకీయాలు
- కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు ఇవ్వాలన్న పట్టించుకోవట్లేదు
- సాగర్‌లో నీళ్లున్నా ఇవ్వడం లేదు
- మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి విమర్శలు
G Jgadeesh Reddy | తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆడుతున్న నాటకం బయటపడిందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై కేంద్ర జల సంఘం నివేదికను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నేపల్లి పంపుహౌస్‌ను ప్రారంభించాలని కేటీఆర్ పలుమార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎన్‌డీఎస్ఏ పేరుతో ప్రభుత్వం చెప్పిందే చెబుతోందని విమర్శించారు. కన్నేపల్లి పంపులు నడిపి ఉంటే మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్ జలాశయాలు నిండేవని పేర్కొన్నారు. వెంటనే పంపులను ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
సాగర్‌లో నీళ్లున్నా.. రైతులకు ఎందుకు ఇవ్వరు?
నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం నీరు ఉన్నప్పటికీ ఎడమ కాల్వ కింద రైతులకు సాగునీరు ఇవ్వడం లేదని జగదీశ్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో 510 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడే సాగునీరు ఇచ్చామని, ఇప్పుడు 518 అడుగుల నీరు ఉన్నా రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎస్ఎల్‌బీసీ కింద నీరు ఇవ్వకపోవడంతో దేవరకొండ రైతులు ధర్నాకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నీరు ఇస్తే విద్యుత్ కొనాల్సి వస్తుందని, పంటలు పండితే ఎరువులు, పంట కొనుగోళ్లకు బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సాగునీరు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎల్‌నినో పేరుతో అధికారులకు నీరు విడుదల చేయొద్దని ఆదేశాలు ఇస్తున్నారని విమర్శించారు. రైతులకు ఎల్‌నినో శాపం కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వమే శాపంగా మారిందన్నారు.
అక్రమంగా ఏపీ నీటి తరలింపు
పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తోందని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. వరద జలాలను మాత్రమే తీసుకోవాల్సి ఉండగా 140 టీఎంసీల నీటిని తరలించారని అన్నారు. గోదావరి, కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వం తెలంగాణకు ద్రోహం చేస్తోందని విమర్శించారు. రైతులకు ఏ పంటలు వేసుకోవాలో, నీరు ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. సాగర్ ఎడమ కాల్వ కింద రైతులకు వెంటనే నీరు విడుదల చేయాలని కోరారు.
కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం ముదిరిందని జగదీశ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని ఆరోపించారు. భూభారతి అంశం కూడా కాంగ్రెస్‌లో పంచాయతీకి కారణమైందన్నారు. సొంత ప్రభుత్వంపైనే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రాబోతోందని తెలిసే కొత్త రాజకీయ డ్రామాకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్, కేటీఆర్‌తో చర్చించి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్.భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిషోర్‌కుమార్, పైలా శేఖర్‌రెడ్డి, నోముల భగత్ తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ganesh Bigala | నిజామాబాద్ ప్రజలను పొంగులేటి మోసం చేశారు
- ●TGEHS | ఈహెచ్ఎస్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.. దేవీప్రసాద్ డిమాండ్..
- ●Meenakshi Chaudhary | ‘కాకా’లో మీనాక్షి చౌదరి.. మెగాస్టార్ సినిమాలో అదిరిపోయే రోల్!
- ●Kiara Advani | హైదరాబాద్ నాకు మరో పుట్టిల్లు - టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కియారా అద్వానీ కామెంట్స్
- ●TG Weather | తెలంగాణలో మూడురోజులు అతిభారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణశాఖ
- ●Maharashtra Hill Tragedy | ఐఫోన్ EMI గొడవతో కొండపై నుంచి పడి కుటుంబం బలి.. తల్లి చివరి వీడియో వైరల్

Ganesh Bigala | నిజామాబాద్ ప్రజలను పొంగులేటి మోసం చేశారు

TGEHS | ఈహెచ్ఎస్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.. దేవీప్రసాద్ డిమాండ్..

Meenakshi Chaudhary | ‘కాకా’లో మీనాక్షి చౌదరి.. మెగాస్టార్ సినిమాలో అదిరిపోయే రోల్!

Kiara Advani | హైదరాబాద్ నాకు మరో పుట్టిల్లు - టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కియారా అద్వానీ కామెంట్స్



