త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Komatireddy Venkat Reddy | అభివృద్ధికి నాణ్యమైన రోడ్లే పునాది : మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

Komatireddy Venkat Reddy | మంచి రహదారులు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి, వ్యాపారాలు పెరుగుతాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తెలిపారు. అభివృద్ధికి నాణ్యమైన రోడ్లే పునాది అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

S

Telangana | Published On Jul 13, 2026, 3.07 pm IST

Komatireddy Venkat Reddy | అభివృద్ధికి నాణ్యమైన రోడ్లే పునాది : మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి
Advertisement

Komatireddy Venkat Reddy | త్రినేత్ర‌.న్యూస్ : మంచి రహదారులు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి, వ్యాపారాలు పెరుగుతాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి తెలిపారు. అభివృద్ధికి నాణ్యమైన రోడ్లే పునాది అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. రూ. 237 కోట్లతో మక్తల్ - నారాయణపేట నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డుకు మంత్రులు వాకిటి శ్రీహ‌రి, జూప‌ల్లి కృష్ణారావుతో క‌లిసి రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా హ్యామ్ రోడ్ల పైలాన్‌ను మంత్రులు ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి మాట్లాడుతూ.. మక్తల్ నియోజకవర్గంలో రూ.531 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేశాం. మంత్రి వాకిటి శ్రీహరి ప్రతి సమావేశంలో మక్తల్–నారాయణపేట రహదారి గురించి ప్రస్తావిస్తూ, ఈ రోడ్డు నిర్మాణాన్ని మంజూరు చేయాలని నిరంతరం కోరేవారు. ఆ విజ్ఞప్తికి అనుగుణంగానే ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రహదారుల పరిస్థితిపై నాకు పూర్తి అవగాహన ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖల్లో చేపట్టిన పనులకు సుమారు రూ.40 వేల కోట్ల బకాయిలు మిగిల్చడంతో పాటు రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పుల భారం రాష్ట్రంపై మోపారని మంత్రి తెలిపారు.

20 నిమిషాల్లో నారాయణపేటకు చేరుకునేలా నిర్మిస్తాం

పదేళ్లపాటు రోడ్లను సరిగా అభివృద్ధి చేయకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. మక్తల్ - నారాయణపేట రహదారిని 12 నుంచి 16 నెలల్లో పూర్తి చేసి, ప్రజలు కేవలం 20 నిమిషాల్లో నారాయణపేటకు చేరుకునేలా నిర్మిస్తాం. రహదారి విస్తరణకు ప్రజలు సహకరించి అవసరమైన భూమిని ఇవ్వాలి. భూములు ఇచ్చే వారికి ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందిస్తుంది. మంచి రహదారులు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి, వ్యాపారాలు పెరుగుతాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అభివృద్ధికి నాణ్యమైన రోడ్లే పునాది అని ఆయ‌న పేర్కొన్నారు.

అప్పులపై వడ్డీలు చెల్లిస్తూనే ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు

గత ప్రభుత్వ కాలం నాటి బిల్లుల కోసం ఇప్పటికీ కాంట్రాక్టర్లు తిరుగుతున్నా, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్లతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. గత పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వని పరిస్థితి ఉండగా, మా ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. మేము ప్రచారం కంటే పనులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. గత ప్రభుత్వం మాత్రం ప్రచారానికే పరిమితమైంది. రైతులకు ఎకరాకు రూ.6,000 చొప్పున రైతు భరోసా అందిస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీలు చెల్లిస్తూనే ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లిస్తున్నామ‌ని తెలిపారు.

117 స్థానాలకు పైగా గెలిచి మరోసారి అధికారంలోకి రావడం ఖాయం

టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మార్చుకున్నా, 150 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాలతోనే ముందుకు సాగుతోంది. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ 117 స్థానాలకు పైగా గెలిచి మరోసారి అధికారంలోకి రావడం ఖాయం. దేశ ప్రజల కోసం పనిచేస్తున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలంటే కాంగ్రెస్ కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేయాలి. బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది. పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా అమలు చేయలేదు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించి దేశ ఐక్యత కోసం రాహుల్ గాంధీ కృషి చేశారని, అలాంటి నాయకత్వానికి ప్రజల మద్దతు అవసరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.

Advertisement
Advertisement