Damodar Raja Narasimha | సీఎస్ఆర్ నిధులెన్నొచ్చాయ్.. ఎంత ఖర్చయ్యాయ్
Damodar Raja Narasimha | ప్రజా సంక్షేమానికి సీఎస్‌ఆర్ (CSR) నిధులను సమర్థవంతంగా వినియోగించాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఆయా పరిశ్రమల నుండి జిల్లాకు నిధులు ఎన్ని వచ్చాయని, ఎంత ఖర్చు చేశారని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
- వివరాలపై మంత్రి ఆరా
- వసతుల కల్పనకు ప్రాధాన్యంగా వినియోగించండి
- అవసరాలను గుర్తించి కార్యాచరణ చేపడదాం
- సంగారెడ్డి జిల్లా అధికారులు, పరిశ్రమల ప్రతినిధుల సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ
Damodar Raja Narasimha | త్రినేత్ర.న్యూస్: ప్రజా సంక్షేమానికి సీఎస్‌ఆర్ (CSR) నిధులను సమర్థవంతంగా వినియోగించాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. నిధుల కేటాయింపుపై సంగారెడ్డి జిల్లా అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో శనివారం కలెక్టరేట్ లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాకు ఆయా పరిశ్రమల నుండి జిల్లాకు నిధులు ఎన్ని వచ్చాయని, ఎంత ఖర్చు చేశారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.
విద్య, వైద్య రంగాల అభివృద్ధికి CSR నిధులు వినియోగించాలన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా, పారదర్శకంగా వినియోగించాలని చెప్పారు. సామాజిక అభివృద్ధికి దోహదపడే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో విద్య, వైద్యం, తాగునీరు, పారిశుధ్యం, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వైద్య సంస్థల మౌలిక సదుపాయాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులను ప్రాధాన్యతతో కేటాయించాలని సూచించారు.

జిల్లాలోని పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకొని ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. జిల్లాలోని ఆయా అవసరాలను గుర్తించి, కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో వాష్ రూమ్స్, కాంపౌండ్ వాల్స్, కిచెన్ షేడ్స్, డైనింగ్ హాల్, డార్మెంటరీ, బెడ్స్, అదనపు క్లాస్‌రూమ్‌ల నిర్మాణం, ఫర్నీచర్, తాగునీటి సౌకర్యాలు, పారిశుధ్య వసతుల కల్పనకు సీఎస్‌ఆర్ నిధులను ప్రాధాన్యతగా వినియోగించాలని మంత్రి చెప్పారు.
సీఎస్‌ఆర్ ప్రతిపాదనల అమలు, పురోగతిపై సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టి, ప్రతిపాదిత పనులు సకాలంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలోని పరిశ్రమలు సామాజిక అభివృద్ధిలో భాగస్వాములై ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. సీఎస్‌ఆర్ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి వారికి పలు సూచనలు చేశారు. ప్రజా ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, ఆర్డీవోలు, సంబంధిత శాఖల అధికారులు, పరిశ్రమలు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల
- ●Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- ●TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!
- ●Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు 'కారుణ్య మరణం' ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన
- ●Peddi Movie | పెద్ది తెలంగాణలో షాక్.. ధరల పెంపును నో చెప్పిన హైకోర్టు..!
- ●Delhi Dust Storm | ఢిల్లీని వణికించిన గాలి దుమారం: గంటకు 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షం

Telangana Formation Day | రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం.. జెండా ఎగురవేసే ప్రముఖుల జాబితా విడుదల

Congress CLP Leader Karnataka | కర్ణాటక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవ ఎన్నిక

TG Weather | తెలంగాణ వాసులకు ఎండల నుంచి ఉపశమనం.. నాలుగు రోజులు వర్షాలేనన్న ఐఎండీ..!

Surat Man Euthanasia | భార్య వేధింపులు.. పోలీసుల నిర్లక్ష్యం: నాకు 'కారుణ్య మరణం' ప్రసాదించండి అంటూ సూరత్ వాసి ఆవేదన





