Employee Health Scheme | ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత పటిష్టం చేయాలి : సీఎస్ సంజయ్ జాజు
Employee Health Scheme | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు సకాలంలో అందేలా తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (టీఈహెచ్‌సీటీ)ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హెల్త్‌కేర్ ట్రస్ట్ నిధులను సమర్థంగా వినియోగిస్తూ లబ్ధిదారులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
Employee Health Scheme | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు సకాలంలో అందేలా తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ (టీఈహెచ్‌సీటీ)ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హెల్త్‌కేర్ ట్రస్ట్ నిధులను సమర్థంగా వినియోగిస్తూ లబ్ధిదారులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ సమావేశం జరిగింది. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు తీరు, ఎంపానెల్ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, చికిత్స ప్యాకేజీల రేట్లు, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
ప్యాకేజీ రేట్లపై సమగ్ర పరిశీలన
ప్రస్తుతం అమలవుతున్న వివిధ చికిత్స ప్యాకేజీల రేట్లను మరోసారి సమగ్రంగా పరిశీలించాలని సీఎస్ సూచించారు. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. అవసరమైన చోట్ల మార్పులు, చేర్పులు చేపట్టాలని చెప్పారు. ఆరోగ్య పథకం ప్రయోజనాలు లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. ట్రస్ట్ పనితీరును మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు అవసరమైన సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్యాకేజీ రేట్లు, ఆసుపత్రుల ఎంపిక, వైద్య సేవల నాణ్యత, ఆర్థిక నిర్వహణ తదితర అంశాలను ఈ కమిటీలు ఎప్పటికప్పుడు పరిశీలించి ట్రస్ట్‌కు తగిన సూచనలు చేయాలని నిర్ణయించారు.
అత్యవసర వైద్యానికి ప్రత్యేక ఏర్పాట్లు
అత్యవసర వైద్యం అవసరమైన ఉద్యోగులు, పెన్షనర్లకు అనుమతుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి లేకుండా తక్షణమే వైద్య సహాయం అందేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని సీఎస్ ఆదేశించారు. ఇందుకోసం 24 గంటల సహాయ వ్యవస్థను ఏర్పాటు చేయడంతోపాటు వేగవంతమైన అనుమతి విధానాన్ని అమలు చేయాలని సూచించారు. సంబంధిత ఆసుపత్రులతో సమన్వయాన్ని మరింత పటిష్ఠం చేసి అత్యవసర సందర్భాల్లో చికిత్సకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఆరోగ్య పథకాన్ని సులభంగా వినియోగించుకునేలా ట్రస్ట్ కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని సంజయ్ జాజు సూచించారు. పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటికి త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరు
సమావేశంలో స్పెషల్ సీఎస్ మహేశ్ దత్ ఎక్కా, ముఖ్య కార్యదర్శులు సందీప్ సుల్తానియా, యోగితారాణా, క్రిస్టినా చొంగ్తూ, శిఖా గోయల్, హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈఓ జెండగే హనుమంత్ కొండిబా, కార్యదర్శులు శ్రుతి ఓజా, దివ్య, సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. టీఎన్‌జీవో సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీవో సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, తెలంగాణ సెక్రటేరియేట్ అసోసియేషన్ అధ్యక్షుడు జీ శ్రీనివాసరెడ్డి, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి, పీఆర్‌టీయూ ప్రతినిధి దామోదర్‌రెడ్డి, తెలంగాణ యూటీఎఫ్ ప్రతినిధి చావా రవి, ఎస్టీయూ అధ్యక్షుడు సదానందగౌడ్, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, తెలంగాణ రిటైర్డ్ అధికారుల సంఘం మహిళా అధ్యక్షురాలు ఉమాదేవి, ఎస్‌టీఎఫ్ అధ్యక్షుడు డీ సైదులు హాజరయ్యారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MGU PhD Notification | ఎంజీయూ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 20 వరకు దరఖాస్తులు..!
- ●Vakiti Srihari | నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి
- ●SIR | 'సర్' గడువు మరోసారి పొడిగింపు.. ఆగస్టు 10 దాకా అవకాశం
- ●Rashmika Mandanna | షూటింగ్లో రష్మిక మందన్నకు గాయం - ఆరు వారాలు సినిమాలకు బ్రేక్
- ●Income Tax Return | ట్యాక్స్ రిటర్న్‌కు చివరి గడువు నేడే.. ఇప్పటికే 5.5 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు
- ●Traffic Restrictions | సికింద్రాబాద్ మహంకాళి బోనాలు.. హైదరాబాద్‌లో మూడు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు

MGU PhD Notification | ఎంజీయూ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల.. ఆగస్టు 20 వరకు దరఖాస్తులు..!

Vakiti Srihari | నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి

SIR | 'సర్' గడువు మరోసారి పొడిగింపు.. ఆగస్టు 10 దాకా అవకాశం

Rashmika Mandanna | షూటింగ్లో రష్మిక మందన్నకు గాయం - ఆరు వారాలు సినిమాలకు బ్రేక్



