Chamala Kiran Kumar Reddy | పదేండ్లు అధికారంలో ఉండి మూసీని ఎందుకు అభివృద్ధి చేయలే?.. కేటీఆర్‌పై ఎంపీ చామల ఫైర్
Chamala Kiran Kumar Reddy | సబర్మతి, గంగా నదుల్లానే మూసీ నది ప్రక్షాళన జరగాలనేది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని భూవనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం మూసీ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి (Revanth Reddy) శ్రీకారం చుట్టారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జరగని మూసీ అభివృద్ధి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హయాంలో జరుగుతుందని కేటీఆర్ (KTR) భయపడుతున్నారని విమర్శించారు.
Chamala Kiran Kumar Reddy | త్రినేత్ర.న్యూస్: సబర్మతి, గంగా నదుల్లానే మూసీ నది ప్రక్షాళన జరగాలనేది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని భూవనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం మూసీ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి (Revanth Reddy) శ్రీకారం చుట్టారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జరగని మూసీ అభివృద్ధి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హయాంలో జరుగుతుందని కేటీఆర్ (KTR) భయపడుతున్నారని విమర్శించారు. మింగడానికి మెతుకు లేదని చెప్పడానికి కేటీఆర్‌కు సిగ్గు లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల దరిద్రపు పాలనతో రాష్ట్రం అప్పుల పాలయిందని ధ్వజమెత్తారు. పదేండ్లలో మూసీని ఎందుకు అభివృద్ధి (Musi Developement) చేయలేదో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
`సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనపై ఈ నెల 13న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలు చెప్పారు. డ్రైనేజీ వాటర్‌ను క్లిన్ చేసి పంప్ చేయడమే కాకుండా గోదావరి నీళ్లను మూసీకి తీసుకు రావడం లక్ష్యంగా సీఎం రేవంత్ ప్రణాళికలు రూపొందించారు. సబర్మతి నది, గంగా నది ప్రక్షాళన ఏ విధంగా జరిగిందో అదేలా మూసీ నది ప్రక్షాళన జరగాలనేది సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం.
నేను ఎంపీగా స్వయంగా సబర్మతి నదిని సందర్శించా. అక్కడ 21 కిలోమీటర్లకు 10 వేల కుటుంబాలను సబర్మతి పరివాహక ప్రాంతం నుంచి తరలించారు. గుజరాత్‌లో బీజేపీ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అహ్మదాబాద్ నగర మేయర్ ఇమ్మత్ సింగ్ పటేల్ ఇద్దరూ కలిసి సబర్మతి సరోవర్ అభివృద్ధి చేశారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్, బీజేపీ పరస్పరం సహకరించుకున్నాయి.
హైదరాబాద్ నగర ఆర్ధిక అభివృద్ధి కోసం మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. కేటీఆర్‌కు ఎందుకు అక్కసు. ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చిన 24 గంటల్లో కేటీఆర్ పోటీ ప్రజెంటేషన్ ఇచ్చి అబద్దాలు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో జరగని మూసీ అభివృద్ధి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హయాంలో జరుగుతుందని కేటీఆర్ భయపడుతున్నారు. మింగడానికి మెతుకు లేదని చెప్పడానికి కేటీఆర్‌కు సిగ్గు లేదా?. మీకు మిగులు రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు అప్పగించారు. సామెతలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం కేటీఆర్ కు అలవాటుగా మారింది.
బీఆర్ఎస్ పదేళ్ల దరిద్రపు పాలనతో రాష్ట్రం అప్పుల పాలయింది. పదేండ్లలో మూసీని ఎందుకు అభివృద్ధి చేయలేదో కేటీఆర్ సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి అయ్యాక చేద్దామని కేటీఆర్ కళలు కన్నారా?. మూసీ ప్రజలు మురికి కూపంలో ఉండాలా?. మూసీ ప్రక్షాళనకు రూ.లక్షా 50 వేల కోట్లు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మీకు లాగా రూ.లక్షా 50 వేల కోట్లతో కాళేశ్వరంను కట్టి కూలేశ్వరం చేయలేదు. తుమ్మిడి హెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ వద్ద కట్టారు. అదే రూ.లక్షా 50 వేల కోట్లతో మూసీ అభివృద్ధితో పాటు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు అన్ని పూర్తి అయ్యేవి. ఎప్పటికీ అధికారం మాదే అని కేటీఆర్ విర్రవీగారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. 2023 తర్వాత జరిగిన ఒక్క ఎన్నికల్లోను బీఆర్ఎస్ గెలవలేదు. బీఆర్ఎస్ పాట బీజేపీ నేతలు పాడుతున్నారు. ఇరు పార్టీలు మిత్రులుగా మారాయి.
కేటీఆర్ ఒకసారి సబర్మతి సరోవర్ కు వెళ్లి చూసి రండి. కేటీఆర్, తెలంగాణ బీజేపీ నేతలు కలిసి తెలంగాణ మీడియాను అహ్మదాబాద్ తీసుకువెళ్లి సబర్మతి సరోవర్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, డెవలప్‌మెంట్‌లో ఆ నగరం ఎంత ముందుకు వెళ్లిందో అక్కడి అధికారులను, ప్రజలను అడగండి. ప్రపంచం మొత్తం తిరిగిన అని చెప్పుకునే కేటిఆర్‌కు థేమ్స్ నది అభివృద్ధి కనపడలేదా?. హాన్ నది అభివృద్ధి కనపడలేదా?.
మూసీని అభివృద్ధి చేయాలనే ఆలోచన కేటీఆర్‌కు ఎందుకు రాలేదు. పెద్ద స్కాలర్ లాగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. పేద ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. సబర్మతికి వెళ్లి అక్కడి అభివృద్ధిని తెలంగాణ ప్రజలకు చూపించండి. కేసీఆర్ కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు పదేండ్లు చూశారు. రేవంత్ రెడ్డి ఇండ్లు కూలగొడుతున్నారు. కట్టడం లేదని కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ ఎక్కడికి వస్తావో చెప్పు నీ సిరిసిల్ల రావాలా? లేదా నువ్వు భువనగిరికి వస్తావా?. ప్రతి నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం 3,500 ఇండ్లు ఇచ్చింది. తెలంగాణ ప్రజలు కేటీఆర్ మాటలను నమ్మవద్దు.
కేటీఆర్ ఫేక్ ప్రచారాలు బంద్ చేయాలి. రేవంత్ రెడ్డిపై కేటీఆర్‌కు అంత అక్కసు ఎందుకు?. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర కేటీఆర్ పోషించాలి. గాంధీ సరోవర్‌కు రూ.70 కోట్లు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ రూ.లక్షా 5ం వేల కోట్లు అవుతుందని కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లడం బీఆర్ఎస్, బీజేపీ అజెండాగా మారింది. కేటీఆర్, హరీశ్ రావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంతా కలిసి సబర్మతి నదిని చూసిరావాలి.` అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



