MP Chamala Kirankumar Reddy | భువనగిరిలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపండి: జీఎంకు ఎంపీ చామల వినతి
MP Chamala Kirankumar Reddy | భువనగిరి నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ దృష్ట్యా కీలక ఎక్స్‌ప్రెస్ రైళ్లను భువనగిరి స్టేషన్‌లో ఆపాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం కార్యదర్శి, డీజీఎం (కో-ఆర్డినేషన్) శ్రీనివాస్ మల్లాదిని కలిసి వినతి పత్రాలను అందజేశారు.
MP Chamala Kirankumar Reddy | త్రినేత్ర.న్యూస్: భువనగిరి నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ దృష్ట్యా కీలక ఎక్స్‌ప్రెస్ రైళ్లను భువనగిరి స్టేషన్‌లో ఆపాలని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలు రైల్వే సమస్యలను తక్షణమే పరిష్కరించి, ప్రయాణికులకు కనీస వసతులు కల్పించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం కార్యదర్శి, డీజీఎం (కో-ఆర్డినేషన్) శ్రీనివాస్ మల్లాదిని కలిసి వినతి పత్రాలను అందజేశారు.
అత్యవసరంగా వసతులు కల్పించండి..
నిత్యం వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, భక్తులు ఇక్కడి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణాలు సాగిస్తున్నారని చెప్పారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు అత్యవసరంగా కల్పించాలని కోరారు. బీబీనగర్ సికింద్రాబాద్ నుండి యాదగిరిగుట్ట వరకు పొడిగించిన ఎంఎంటీఎస్ రైలు కొరకు ఇండ్లు కోల్పోయిన 70 మంది బాధితులకు న్యాయం చేయాలనే కోరారు.
వంగపల్లి - యాదగిరి గుట్ట మధ్య రైల్వే అండర్‌పాస్...
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని వంగపల్లి - యాదగిరి గుట్ట మధ్య ఉన్న రైల్వే అండర్‌పాస్ లేకపోవడం వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అండర్‌పాస్‌ను మంజూరు చేసి, ఆధునిక టూ వే (Two-way) బ్రిడ్జ్‌గా నిర్మించాలని కోరారు. ఈ వినతులపై డీజీఎం, జీఎం సెక్రటరీ శ్రీనివాస్ మల్లాది సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు. భువనగిరి నియోజకవర్గ ప్రజలు, ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రాధాన్య క్రమంలో త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ దృష్ట్యా కింది ఎక్స్‌ప్రెస్ రైళ్లను భువనగిరి స్టేషన్‌లో ఆపాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.
- పద్మావతి ఎక్స్‌ప్రెస్ (Train No. 12764)
- కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (Train No. 11020)
- శాతవాహన ఎక్స్‌ప్రెస్ (Train No. 12714)
- భద్రాచలం - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ (Train No. 12745)
- తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (Train No. 12723)
తాజావార్తలు
- ●KTR | గల్ఫ్‌లో ఉన్నోళ్ల ఓట్లు పోనివ్వం.. ఎస్ఐఆర్పై సీఈసీని కలుస్తాం: కేటీఆర్
- ●Dialysis Patients | డయాలసిస్ పేషెంట్లకు అండగా ప్రభుత్వం.. 2,356 మందికి కొత్తగా పెన్షన్లు
- ●Nivetha Pethuraj | వెంకటేష్ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ - మరోసారి ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్?
- ●Thummala Nageshwar Rao | బ్యాంకులు దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అందించాలి: మంత్రి తుమ్మల
- ●Stock Markets | బ్యాంకింగ్ షేర్ల జోరు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- ●Twisha Sharma | ట్విషా శర్మ కేసులో ట్విస్ట్.. రెండోసారి పోస్టమార్టంకు హైకోర్టు అనుమతి

KTR | గల్ఫ్‌లో ఉన్నోళ్ల ఓట్లు పోనివ్వం.. ఎస్ఐఆర్పై సీఈసీని కలుస్తాం: కేటీఆర్

Dialysis Patients | డయాలసిస్ పేషెంట్లకు అండగా ప్రభుత్వం.. 2,356 మందికి కొత్తగా పెన్షన్లు

Nivetha Pethuraj | వెంకటేష్ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ - మరోసారి ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్?

Thummala Nageshwar Rao | బ్యాంకులు దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అందించాలి: మంత్రి తుమ్మల





