BRS Malaysia | తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్రావతరణ వేడుకలు: బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు మారుతి కుర్మ
BRS Malaysia | తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర అవతరణ వేడుకలకు అంతా సిద్ధమయ్యామని బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షులు మారుతి కుర్మ (Maruthi Kurma) తెలిపారు. బీఆర్ఎస్ మలేషియా, మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) సంస్థలు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
BRS Malaysia | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర అవతరణ వేడుకలకు అంతా సిద్ధమయ్యామని బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షులు మారుతి కుర్మ (Maruthi Kurma) తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా మలేషియాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ మలేషియా, మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) సంస్థలు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
మైటా అధ్యక్షులు సైదం తిరుపతి, బీఆర్ఎస్ మలేషియా స్థాపకులు చిట్టిబాబు చిరుత కూడా కార్యక్రమ నిర్వహణలో చురుకుగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక కోసం మలేషియాలోని తెలుగువారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సభ్యులు తెలిపారు.
మునిగల అరుణ్, మిథున్, దిలీప్, సందీప్ గౌడ్, శశి, అభిలాష్, అన్వేష్, మధుకర్, హరీష్, గోకుల్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ వేడుకలను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్





