POCSO Case | బాలికకు అండగా నిలువాల్సింది పోయి.. చట్టాన్ని బలపీఠం ఎక్కిస్తున్నరు.. సర్కారుపై దేశ్‌పతి ఫైర్..!
POCSO Case | రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై శాసన మండలి బీఆర్ఎస్ ఎల్పీవిప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. మైనర్ బాలికకు న్యాయం జరగకుండా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి పరస్పర రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు. నిందితుడిని కాపాడేందుకు సరిహద్దులు దాటించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సమాజం ఒక వికృత రాజకీయ క్రీడకు సాక్షిగా నిలుస్తోందని అన్నారు. బాధితురాలికి అండగా నిలవాల్సిన పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చట్టాన్ని బలిపీఠం ఎక్కిస్తున్నారని ఆరోపించారు. పోక్సో చట్టం ప్రకారం నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేయాల్సి ఉన్నప్పటికీ, కేంద్ర సహాయ మంత్రి తన అధికారాన్ని ఉపయోగించి తన కుమారుడిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనే నిందితుడిని దేశ సరిహద్దులు దాటించే కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హోం మంత్రిగా ఉన్నప్పటికీ విచారణలో చూపుతున్న కాలయాపన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని సభ కారణంగా విచారణ ఆలస్యమైందని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.
కేంద్ర, రాష్ట్ర పాలకుల మధ్య రహస్య ఒప్పందం జరిగిందని, ఒకరు మరొకరి రాజకీయ ప్రయోజనాలను కాపాడుకుంటున్నారని దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. రక్షక భట నిలయాలు భక్షక నిలయాలుగా మారి అధికార పీఠానికి మోకరిల్లుతున్నాయని ఆయన విమర్శించారు. చట్టబద్ధ పాలనకు ఇది ప్రమాదకర సంకేతమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మహిళలు, మేధావులు, విద్యావంతులు ఈ అన్యాయంపై గళమెత్తాలని ఆయన పిలుపునిచ్చారు. చట్టం ముందు అందరూ సమానమే అనే న్యాయం స్థాపించేవరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



