Ilambarthi | ఎల్‌నినోను సమష్టిగా ఎదుర్కొందాం
Ilambarthi | ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో మిషన్ మోడ్‌లో పనిచేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు, కంటింజెన్సీ ప్లాన్‌లను సమర్థంగా అమలు చేస్తే వర్షాభావ పరిస్థితులను అధిగమించవచ్చని చెప్పారు.
- అన్ని శాఖలు మిషన్ మోడ్‌లో పనిచేయాలి
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇలంబర్తి
Ilambarthi | ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో మిషన్ మోడ్‌లో పనిచేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు, కంటింజెన్సీ ప్లాన్‌లను సమర్థంగా అమలు చేస్తే వర్షాభావ పరిస్థితులను అధిగమించవచ్చని చెప్పారు. సోమవారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం-ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన ఎల్-నినో సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశానికి ముందు జిల్లా కలెక్టర్లు, అధికారులు ప్రత్యేక అధికారికి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.
ఎల్‌నినో ప్రభావాన్ని కేవలం వ్యవసాయానికే పరిమితం చేయకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్, పశుసంవర్థక, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, ఉద్యానవనం, భూగర్భ జలాలు, ఇరిగేషన్ తదితర రంగాలన్నింటిపై దృష్టి సారించి శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఇలంబర్తి సూచించారు. గ్రామస్థాయిలో రైతులకు వర్షాభావ పరిస్థితులు, నీటి పొదుపు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కందులు, పెసర్లు, నువ్వులు, వేరుశనగ, చిరుధాన్యాలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. సమావేశంలో జిల్లాల వారీగా జలాశయాల నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి లభ్యత, సాగునీటి పరిస్థితులు, విద్యుత్ సరఫరా, పంటల స్థితిగతులను సమీక్షించారు. తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ప్రస్తుత అంచనాల ప్రకారం 40 నుంచి 45 శాతం వరకు వర్షపాత లోటు నమోదయ్యే అవకాశం ఉన్నందున వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్థక, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మున్సిపల్, తాగునీరు, విద్యుత్, వైద్యం, భూగర్భ జలాలు, ఇరిగేషన్, మహిళా శిశు సంక్షేమం, కృషి విజ్ఞాన కేంద్రం తదితర శాఖలు తమ యాక్షన్ ప్లాన్‌లు, కంటింజెన్సీ ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు. రైతులు, ప్రజల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని శాఖల సిబ్బంది సమష్టిగా పనిచేస్తే ఎల్-నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చని ఇలంబర్తి వివరించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయానికి రూ.2,278 కోట్లు.. 2 వేల ఎకరాల భూసేకరణ
జులై 27, 2026

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
జులై 26, 2026

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
జులై 26, 2026
తాజావార్తలు
- ●Shooting at Food Festival | ఫుడ్‌ఫెస్టివల్‌లో కాల్పులు.. ఇద్దరు దుర్మరణం
- ●Uday Krishna Reddy | పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి
- ●Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయానికి రూ.2,278 కోట్లు.. 2 వేల ఎకరాల భూసేకరణ
- ●Rain Update | నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
- ●UPSC Recruitment | బీఈడీ అర్హతతో యూపీఎస్సీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఉద్యోగాలు
- ●Horoscope | జూలై 27 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఆకస్మిక లాభనష్టాలు ఉండవచ్చు!

Shooting at Food Festival | ఫుడ్‌ఫెస్టివల్‌లో కాల్పులు.. ఇద్దరు దుర్మరణం

Uday Krishna Reddy | పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి

Adilabad Airport | ఆదిలాబాద్ విమానాశ్రయానికి రూ.2,278 కోట్లు.. 2 వేల ఎకరాల భూసేకరణ

Rain Update | నేడు, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు



