త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Party Defection | మ‌రో ఎమ్మెల్యేపై అన‌ర్హ‌త పిటిష‌న్‌ను కొట్టివేసిన స్పీక‌ర్

Party Defection | బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన (Party Defection) మ‌రో ఎమ్మెల్యేపై అన‌ర్హ‌త పిటిష‌న్‌ను (Disqualification) స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ (Speaker, Gaddam prasad) కొట్టివేశారు. ఇప్ప‌టికే ఏడుగురు ఎమ్మెల్యేల‌కు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీక‌ర్‌.. తాజాగా జ‌గిత్యాల ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ (MLA Sanjay) అన‌ర్హ‌త పిటిష‌న్‌పై తీర్పును వెలువ‌రించారు.

G

Telangana | Published On Feb 4, 2026, 11.43 am IST

Party Defection | మ‌రో ఎమ్మెల్యేపై అన‌ర్హ‌త పిటిష‌న్‌ను కొట్టివేసిన స్పీక‌ర్
Advertisement

Party Defection | త్రినేత్ర‌.న్యూస్‌: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన (Party Defection) మ‌రో ఎమ్మెల్యేపై అన‌ర్హ‌త పిటిష‌న్‌ను (Disqualification) స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ (Speaker, Gaddam prasad) కొట్టివేశారు. ఇప్ప‌టికే ఏడుగురు ఎమ్మెల్యేల‌కు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీక‌ర్‌.. తాజాగా జ‌గిత్యాల ఎమ్మెల్యే డాక్ట‌ర్ సంజ‌య్ (MLA Sanjay) అన‌ర్హ‌త పిటిష‌న్‌పై తీర్పును వెలువ‌రించారు. సంజ‌య్‌పై అన‌ర్హ‌త కోరుతూ సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి పిటిష‌న్ వేశారు. పార్టీ మారార‌న‌డానికి స‌రైన ఆధారాలు లేవ‌ని స్పీక‌ర్ ఆ పిటిష‌న్‌ను కొట్టివేశారు. దీంతో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కారు గుర్తుపై గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిదికి ఊర‌ట ల‌భించిన‌ట్ల‌యింది. సాకేంతికంగా వారంతా బీఆర్ఎస్‌లోనే ఉన్న‌ట్లు స్పీక‌ర్‌ స్ప‌ష్టం చేశారు.

మ‌రోవైపు స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహ‌రి అనర్హత పిటిష‌న్‌పై స్పీక‌ర్ గ‌డ్డ ప్ర‌సాద్ కుమార్ విచార‌ణ చేప‌ట్టారు. ఇందులో భాగంగా పిటిష‌న‌ర్‌గా ఉన్న బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఏవైనా ఆ ధారాలు ఉంటే సమర్పించాలని స్పీకర్ ఆయ‌న‌ను ఆదేశించారు. ఇక ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్లపై ఫిబ్ర‌వ‌రి 18న స్పీకర్‌ విచారణ చేపట్టనున్నారు.

ఇక అనర్హ‌త వేటు ఎదుర్కొంటూ.. స్పీక‌ర్ నుంచి క్లీన్‌చిట్ అందుకున్న‌వారిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి, గూడెం మ‌హిపాల్ రెడ్డి, ప్ర‌కాశ్ గౌడ్‌, కాలే యాద‌య్య‌, తెల్లం వెంక‌ట్రావ్‌, అరికెపూడి గాంధీ, సంజ‌య్ ఉన్నారు.

Advertisement
Advertisement