Bhatti Vikramarka | దేవదుర్గ గనిలో పెద్ద ఎత్తున బంగారం.. వెలికి తీయాలని డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
Bhatti Vikramarka | కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి పెద్ద ఎత్తున బంగారం, రాగి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
కాపర్, గోల్డ్ మైనింగ్ అన్వేషణ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించిన డిప్యూటీ సీఎం
దేవదుర్గలో సైట్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని సింగరేణి అధికారులను ఆదేశం
Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్ : కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి పెద్ద ఎత్తున బంగారం, రాగి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించడానికి మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాయచూరు జిల్లా, దేవదుర్గ తాలూకా లింగదహళ్ళి గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కాపర్, గోల్డ్ మైనింగ్ అన్వేషణ కార్యక్రమాన్ని అధికారికంగా డిప్యూటీ సీఎం ప్రారంభించారు. అనంతరం ఖనిజ అన్వేష ప్రదేశాలను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు.
దాదాపు 136 సంవత్సరాల సుదీర్ఘ మైనింగ్ అనుభవం ఉన్న సింగరేణి కాలరీస్ సంస్థ, కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో దేవదుర్గ్ బ్లాక్ ఎక్స్‌ప్లోరేషన్ (అన్వేషణ) హక్కులను దక్కించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

ఈ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అన్వేషణ పనులను సింగరేణి సంస్థ త్వరలోనే వేగవంతం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు విజయవంతమై ఇక్కడ బంగారం, రాగి విరివిగా లభిస్తే ప్రాంతీయంగా నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభించడమే కాకుండా ఈ ప్రాంతం శీఘ్రగతిన అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పనుల పర్యవేక్షణ కోసం అధికారులు ఇక్కడే ఉండేలా సింగరేణి ఆధ్వర్యంలో త్వరలోనే ఒక సైట్ ఆఫీస్‌ను, అలాగే రాకపోకల సౌకర్యార్థం హెలిప్యాడ్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. స్థానిక రెవెన్యూ అధికారులు స్థలాన్ని కేటాయించిన వెంటనే ఈ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు.
అలాగే, కృష్ణానదికి ఇరువైపులా ఉన్న తెలుగు, కర్ణాటక ప్రజల మధ్య విడదీయరాని చారిత్రక, సాంస్కృతిక బంధం ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలోనే భాగమైనందున మన మూలాలు ఒక్కటేనని గుర్తుచేశారు., స్థానిక ప్రజల అండదండలతో ఈ ప్రాజెక్టును త్వరలోనే విజయవంతంగా పూర్తి చేసి దేశ సంపదను పెంచడానికి ఉపయోగపడదామని పిలుపునిచ్చారు. ఈ అన్వేషణ రెండు రాష్ట్రాల పురోగతికి, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎంతగానో దోహదపడుతుందని ఆకాంక్షించారు.

దేవదుర్గ ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని సింగరేణి సిఎండి డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి అన్నారు. ఈ ప్రాంతంలో గతంలో సీఐగా పని చేశానని ప్రస్తుతం సింగరేణి సంస్థ చైర్మన్ డైరెక్టర్‌గా ఇక్కడ బంగారం, రాగి అన్వేషణ పనులను స్థానికుల సమక్షంలో ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ పరమానంద స్వామి గుట్ట పరమానంద స్వామి ఆశీస్సులతో ఇక్కడ బంగారు నిక్షేపాలు లభించాలని స్థానికులకు ఉపాధి అవకాశాలు కలగాలని ఆకాంక్షించారు.
రాయిచూర్‌లో బంగారం, రాగి ఖనిజ బ్లాకును పరిశీలించిన డిప్యూటీ సీఎం
లింగదహళ్ళి గ్రామానికి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కర్ణాటక మాజీ మంత్రి బోసురాజు తనయుడు, కాంగ్రెస్ నాయకుడు రవి బోసురాజు, స్థానిక సర్పంచ్ ఎల్లమ్మ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా లింగదహళ్ళిలోని దేవదుర్గ బంగారు ఖనిజ బ్లాక్ వ్యూ పాయింట్ నుంచి ఖనిజ అన్వేషణ చేపట్టనున్న ప్రాంతాలను ఉప ముఖ్యమంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అక్కడి బ్లాక్ నుంచి సింగరేణి అధికారులు సేకరించిన వివిధ రకాల ఖనిజ నమూనాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

ఈ సందర్భంగా అక్కడ నిర్వహించబోయే బంగారం, రాగి వెలికితీత, అన్వేషణ ప్రక్రియల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సింగరేణి అధికారులు మరియు కర్ణాటక రాష్ట్ర అధికార యంత్రాంగంతో డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించి ఖనిజ అన్వేషణపై దిశా నిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి పర్యటన ముగించుకుని లింగదహళ్ళి గ్రామంలోని చారిత్రక నేపథ్యం కలిగిన శ్రీ పరమానంద శివాలయాన్ని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, డైరెక్టర్ సీకే వెంకటేశ్వర్లు, జిఎం పంకజ్ కుల శ్రేష్ట, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, సింగరేణి ఉన్నతాధికారులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు : సీఎం రేవంత్ రెడ్డి
- ●TGSRTC | రాఖీ పండుగకు 5,000 ఆర్టీసీ బస్సులు..
- ●KCR | సోదరీ సోదరుల అనుబంధం అజరామరం : కేసీఆర్
- ●HMWSSB | హైదరాబాద్‌లో 29న నీటి సరఫరా బంద్
- ●MP Eatala Rajender | నీతి మాటలు చెబుతున్న రంగనాథ్.. నిజంగా హిట్లర్ లెక్క చేశారు : ఎంపీ ఈటల
- ●MP Vaddiraju | ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చండి.. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేయండి : ఎంపీ వద్దిరాజు

CM Revanth Reddy | అక్కాచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు : సీఎం రేవంత్ రెడ్డి

TGSRTC | రాఖీ పండుగకు 5,000 ఆర్టీసీ బస్సులు..

KCR | సోదరీ సోదరుల అనుబంధం అజరామరం : కేసీఆర్

HMWSSB | హైదరాబాద్‌లో 29న నీటి సరఫరా బంద్



