Shubman Gill | శుభ్‌మన్ గిల్ రికార్డు.. వేగంగా 1000 రన్స్ చేసిన బ్యాటర్‌గా ఘనత
Shubman Gill | టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో రికార్డును నెలకొల్పాడు. సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరిన భారత బ్యాటర్‌గా ఘనత దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఆ రికార్డు కలిగి ఉన్న విరాట్ కోహ్లీని గిల్ అధిగమించడం విశేషం.
Shubman Gill | టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో రికార్డును నెలకొల్పాడు. సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరిన భారత బ్యాటర్‌గా ఘనత దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఆ రికార్డు కలిగి ఉన్న విరాట్ కోహ్లీని గిల్ అధిగమించడం విశేషం. ఆఫ్ఘనిస్థాన్‌తో లక్నోలో జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా రికార్డును చేరుకున్నాడు. ఫామ్‌లో ఉన్న గిల్ ఈ మ్యాచ్‌లో కూడా తన దూకుడును కొనసాగించాడు. అర్ధశతకం సాధించి జట్టు స్కోరుకు బలమైన ఆధారం అందించాడు. అతని ఇన్నింగ్స్ వల్ల భారత్ పవర్‌ప్లే అనంతరం స్థిరమైన స్థితిలోకి వెళ్లింది. ఇక ఇదే మ్యాచ్‌లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది.
సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ లిస్ట్ ఏ క్రికెట్‌లో 14వేల పరుగుల మైలురాయిని చేరిన ఆటగాడిగా నిలిచాడు. అనుభవం, నిలకడకు మరోసారి ఇన్నింగ్స్ నిదర్శనంగా నిలిచింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో ఈ మ్యాచ్‌కు పలు మార్పులు చేశారు. యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి అడుగుపెట్టి అరంగేట్రం చేశాడు. అలాగే కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. టీమిండియా 49.5 ఓవర్లలో 402 చేసింది. గిల్ అజేయంగా 155, ఇషాన్ కిషన్ 125 పరుగులు చేయడంతో భారీ స్కోర్ చేయగలిగింది. ప్రస్తుతం అఫ్ఘనిస్తాన్ జట్టు 27 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే భారత్ ఆధిక్యంలో ఉంది. తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు

Hyderabad Metro Rail Takeover | హైదరాబాద్ మెట్రో టేకోవర్‌లో భారీ స్కామ్.. జపాన్ లోన్ వివరాలేవి? రేవంత్‌కు దాసోజు శ్రవణ్ సూటి ప్రశ్నలు
జూన్ 17, 2026

Minister Vakiti Srihari | చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ
జూన్ 17, 2026

Samantha meets TN CM Vijay | తమిళనాడు సీఎం విజయ్ను కలిసిన సమంత.. ‘ఆయన రియల్ హీరో’ అంటూ ఎమోషనల్ పోస్ట్!
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●Hyderabad Metro Rail Takeover | హైదరాబాద్ మెట్రో టేకోవర్‌లో భారీ స్కామ్.. జపాన్ లోన్ వివరాలేవి? రేవంత్‌కు దాసోజు శ్రవణ్ సూటి ప్రశ్నలు
- ●Minister Vakiti Srihari | చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ
- ●Samantha meets TN CM Vijay | తమిళనాడు సీఎం విజయ్ను కలిసిన సమంత.. 'ఆయన రియల్ హీరో' అంటూ ఎమోషనల్ పోస్ట్!
- ●Trump Road | హైదరాబాద్‌లో కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టొద్దు : లెఫ్ట్ పార్టీలు
- ●TG High Court | ఆ ఐదెకరాల భూమి మాదే.. తెలంగాణ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన హైకోర్టు..!
- ●ADG Vijay Kumar | లైసెన్స్ లేని సెక్యూరిటీ ఏజెన్సీలపై కఠిన చర్యలు: ఏడీజీ విజయ్ కుమార్

Hyderabad Metro Rail Takeover | హైదరాబాద్ మెట్రో టేకోవర్‌లో భారీ స్కామ్.. జపాన్ లోన్ వివరాలేవి? రేవంత్‌కు దాసోజు శ్రవణ్ సూటి ప్రశ్నలు

Minister Vakiti Srihari | చిచెస్టర్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ

Samantha meets TN CM Vijay | తమిళనాడు సీఎం విజయ్ను కలిసిన సమంత.. 'ఆయన రియల్ హీరో' అంటూ ఎమోషనల్ పోస్ట్!

Trump Road | హైదరాబాద్‌లో కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టొద్దు : లెఫ్ట్ పార్టీలు



