Minister Vakiti Srihari | చేప ప్రసాదం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు: మంత్రి వాకిటి శ్రీహరి
Minister Vakiti Srihari | మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మృగశిర కార్తిని వేడి తగ్గి వాతావరణం చల్లబడే కాలంగా భావిస్తారని ఆయన పేర్కొన్నారు.
Minister Vakiti Srihari | మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మృగశిర కార్తిని వేడి తగ్గి వాతావరణం చల్లబడే కాలంగా భావిస్తారని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన విడుదల చేసిన పాయింట్లలో, 176 సంవత్సరాలుగా బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ జరుగుతోందని గుర్తుచేశారు. ఈ సంప్రదాయం ప్రజల్లో ఉన్న నమ్మకం, విశ్వాసానికి ప్రతీకగా కొనసాగుతోందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారని తెలిపారు.
ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో 1 లక్షా 35 వేల చేప పిల్లలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. బత్తిని కుటుంబం అనవాయితీగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి విభాగం నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 8న రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమవుతుందని, 9వ తేదీ అంతా కొనసాగుతుందని తెలిపారు. చివరి వ్యక్తి వరకు ప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకు అధికారులు అక్కడే ఉంటారని స్పష్టం చేశారు. ఉబ్బసం, ఆయాసం వంటి శ్వాస సంబంధిత సమస్యలకు నమ్మకంతో ఈ ప్రసాదాన్ని తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు. ఆయాసం, ఉబ్బసానికి ఇది మంచి ఉపశమనం ఇస్తుందనే విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు ఏ చిన్న అవసరం వచ్చినా అధికారులు అందుబాటులో ఉంటారని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ashika Ranganath | హీరోయిన్‌ది కాదు దర్శకుడిదే తప్పు - పెద్ది వివాదంపై కన్నడ హీరోయిన్ కామెంట్స్
- ●CP Ramesh | ప్రైవేట్ ట్రావెల్స్తో సైబరాబాద్ పోలీసుల సమావేశం.. విద్యార్థుల భద్రతకు కీలక ఆదేశాలు..
- ●Minister Uttam Kumar reddy | బియ్యం ఎగుమతులకు తెలంగాణ కేంద్రంగా మారాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ●Minister Sridhar babu | సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : మంత్రి శ్రీధర్ బాబు
- ●CM Revanth Reddy | మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Samantha | మా ఇంటి బంగారంలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సమంత కాదట - నాచురల్ బ్యూటీతో అనుకొని...

Ashika Ranganath | హీరోయిన్‌ది కాదు దర్శకుడిదే తప్పు - పెద్ది వివాదంపై కన్నడ హీరోయిన్ కామెంట్స్

CP Ramesh | ప్రైవేట్ ట్రావెల్స్తో సైబరాబాద్ పోలీసుల సమావేశం.. విద్యార్థుల భద్రతకు కీలక ఆదేశాలు..

Minister Uttam Kumar reddy | బియ్యం ఎగుమతులకు తెలంగాణ కేంద్రంగా మారాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Minister Sridhar babu | సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : మంత్రి శ్రీధర్ బాబు




