Jeevan Reddy | 13న బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డి..?
Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీలో అవమానాలు భరించలేక, సీఎం రేవంత్ రెడ్డి నియంతృత్వ పోకడను నిరసిస్తూ ఆ పార్టీకి మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన కారెక్కెందుకు సిద్ధమైనట్లు సమాచారం.
Jeevan Reddy | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ పార్టీలో అవమానాలు భరించలేక, సీఎం రేవంత్ రెడ్డి నియంతృత్వ పోకడను నిరసిస్తూ ఆ పార్టీకి మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన కారెక్కెందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెల 13వ తేదీన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఈ చేరిక కంటే ముందు.. ఏప్రిల్ 7వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఏప్రిల్ 13న తన అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఆ తర్వాత జగిత్యాలలోనే ప్లీనరీ సమావేశం నిర్వహించే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
మార్చి 25న రాజీనామా..
నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీని వీడాలంటే బాధాకరంగా ఉంది.. కానీ సీఎం రేవంత్ రెడ్డి నియంతృత్వ పోకడ వల్ల పార్టీని వీడక తప్పడం లేదని మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ రెండున్నరేండ్లు ఎంతో మానసిక క్షోభ, అవమానాలు భరించానని పేర్కొన్నారు. ఇక రాబోయే రెండేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తానని ఆయన హెచ్చరించారు. ఈ పార్టీ నాది అని భావిస్తూ.. సీనియర్లను తొక్కుతున్న రేవంత్ రెడ్డికి భవిష్యత్‌లో తగిన గుణపాఠం చెబుతాం.. ఇక నుంచి మమ్మల్ని ఏ శక్తి ఆపలేదని జీవన్ రెడ్డి తేల్చిచెప్పారు. ఇది క్లిష్ట సమయం నాకు.. నా జీవిత చివరి పోరాటం ఇది.. మీ అండదండలతో ఈ స్థాయికి ఎదిగాను.. భవిష్యత్‌లో జగిత్యాలను జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడమే నా సంకల్పం అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. తన మద్దతుదారులు, అభిమానుల సమక్షంలో మార్చి 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను విడుదల చేశారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



