Jeevan Reddy | త్వరలోనే కారెక్కుతా.. కేసీఆర్‌తో కలిసి పని చేస్తా : జీవన్ రెడ్డి
Jeevan Reddy | త్వరలోనే కారెక్కుతానని, అంతకుముందు కేసీఆర్‌తో కలిసి మా ఇద్దరి స్నేహాన్ని నెమరేసుకుంటానని సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది నా జీవితంలోనే సంతోషమైన రోజు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం నాకు లభిస్తునందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
Jeevan Reddy | త్రినేత్ర.న్యూస్ : త్వరలోనే కారెక్కుతానని, అంతకుముందు కేసీఆర్‌తో కలిసి మా ఇద్దరి స్నేహాన్ని నెమరేసుకుంటానని సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది నా జీవితంలోనే సంతోషమైన రోజు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం నాకు లభిస్తునందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా కేటీఆర్‌తో కలిసి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ రోజు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సూచన మేరకు కేటీఆర్ నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. జగిత్యాల జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలందరూ కూడా నా పూర్వ సహచరులే. అందరితో కలిసి పని చేశాను. మారిన పరిస్థితులకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేస్తే రాష్ట్ర భవిష్యత్ కోసం పాటు పడే అవకాశం లభిస్తుంది. ఈ అవకాశం కల్పించేందుకు ముందుకు వచ్చినందుకు బీఆర్ఎస్ నాయకత్వానికి ధన్యవాదాలు. మార్చి 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. కొంత భావోద్వేగానికి లోనయ్యాను. నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నాను. కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు అవకాశం లభిస్తుంన్నందుకు సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం యావత్ కూడా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. 20 నెలల నుంచి మానసిక క్షోభ తట్టుకున్నాను. రాష్ట్ర భవిష్యత్ ప్రధానమని చెప్పి కాంగ్రెస్ పార్టీని వీడానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
పదేండ్లలో సాధించిన ఫలాలు తిరోగమనం దశకు
కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజానికి అభివృద్ధి అందించారు. ఇంకా మెరుగైన పాలన కోసం ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, వైఎస్సార్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ప్రభుత్వాలను చూశాం. కానీ రెండేండ్ల కాలంలో పదేండ్లలో సాధించిన ఫలాలు తిరోగమనం దశకు చేరిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్‌ను కలవాలని కోరుకుంటున్నాను..
మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రజల అభిప్రాయం తీసుకున్నాను. వారి సలహాలు, సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యాను. కేసీఆర్ నాయతక్వంలో పని చేసే అవకాశం 2014లో వచ్చింది కానీ పొలిటికల్ కమిట్‌మెంట్‌తో కాంగ్రెస్‌లోనే కొనసాగాను. ఇవాళ వ్యక్తిగతంగా మానసిక క్షోభ ఎదుర్కొన్నాను. ప్రజా జీవితం రాష్ట్ర హితం, రైతాంగం, బలహీన వర్గాలు, విద్యార్థి లోకం బాధపడుతున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. విద్యార్థి లోకానికి భవిష్యత్ చూపించలేకపోతున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. శేష జీవితంలోనూ ప్రజా జీవితం కోసం పాటు పడుతాను. కేసీఆర్‌తో కలిసి పని చేసే అవకాశం కల్పిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. కేసీఆర్‌ను కలవాలని కోరుకుంటున్నాను.. పాత స్నేహాన్ని, జ్ఞాపకాలను నెమరేసుకుంటాను.. బీఆర్ఎస్ పార్టీలో చేరుతాను అని జీవన్ రెడ్డి తేల్చిచెప్పారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



