Seethakka | రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నబీజేపీ: మంత్రి సీతక్క
Seethakka | మహాత్మా గాంధీ ఆలోచనలతో క్రమశిక్షణ గల సంఘంగా కాంగ్రెస్ సేవాదళ్ (Congress Sevadal) అవతరించిందని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. పార్టీ త్యాగాలు, త్యాగాల చరిత్రను, పార్టీ గొప్పతనాన్ని, ఘనతను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
Seethakka | త్రినేత్ర.న్యూస్: మహాత్మా గాంధీ ఆలోచనలతో క్రమశిక్షణ గల సంఘంగా కాంగ్రెస్ సేవాదళ్ (Congress Sevadal) అవతరించిందని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. క్రమశిక్షణకు మారుపేరు కాంగ్రెస్ సేవాదళ్ అని తెలిపారు. దేశానికి స్వతంత్రం సాధించడంలో, నిర్మించడంలో కాంగ్రెస్ పాత్ర అమోఘమని వెల్లడించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన కాంగ్రెస్ సేవాదళ్ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వాదళ్ కార్యకర్తల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ స్వాత్రంత్య పోరాటంలో కాంగ్రెస్ సేవాదళ్ పాత్ర మరువలేనిదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీది గాంధీ అహింసా సిద్ధాంతమని పేర్కొన్నారు. అదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ సేవాదళ్ కూడా అనుసరిస్తున్నదని స్పష్టం చేశారు.
ఎప్పటికప్పుడు కాంగ్రెస్ సేవాదళ్ పార్టీ సిద్ధాంతాల మీద శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ సేవాదళ్ అంటే దేశభక్తుల సంఘమని చెప్పారు. జిల్లాల్లో కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని వెల్లడించారు. సేవాదళ్ కాంగ్రెస్ సిద్ధాంతాలకు శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. సిద్ధాంత బలం ఉంటే ఎన్ని కష్టాలు అయినా ఎదుర్కోవచ్చని స్ఫష్టం చేశారు.
పార్టీ త్యాగాలు, త్యాగాల చరిత్రను, పార్టీ గొప్పతనాన్ని, ఘనతను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆ దిశలో కాంగ్రెస్ సేవాదళ్ ముందుండి నడిపించాలన్నారు. శిక్షణ కార్యక్రమాలను జిల్లాలకు విస్తరిస్తే మన సైన్యం మరింత బలపడుతుందని చెప్పారు. మహాత్మా గాంధీ జ్ఞానం, నెహ్రూ నిర్మించిన భారతదేశ విధివిధానాలు, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఈ దేశానికి వెన్నెమున్నారు. కానీ రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఐక్యతను దెబ్బతీసి విద్వేష రాజకీయాలను చేస్తున్నదని విమర్శించారు. గాంధీ చూపిన శాంతియుత బాటలో మనం విద్వేష రాజకీయాలను గెలవాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో గాడ్సే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ ఓడించిందన్నారు. ఇది దేశ ఆత్మను కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందని చెప్పారు. ఆ దిశలో రక్షణ దళాలుగా సేవాదళ్ కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



