త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Preetham | మ‌నువాదం వైపు మంద‌కృష్ణ అడుగులు : ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప్రీతం

Preetham | ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదేశాల మేర‌కు న‌డుచుకుంటూ.. మ‌నువాదం వైపు అడుగులు వేస్తున్నాడ‌ని రాష్ట్ర ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప్రీతం నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Mar 7, 2026, 4.18 pm IST

Preetham | మ‌నువాదం వైపు మంద‌కృష్ణ అడుగులు : ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప్రీతం
Advertisement

Preetham | త్రినేత్ర‌.న్యూస్ : ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదేశాల మేర‌కు న‌డుచుకుంటూ.. మ‌నువాదం వైపు అడుగులు వేస్తున్నాడ‌ని రాష్ట్ర ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప్రీతం నిప్పులు చెరిగారు. మాదిగ‌ల దేవుడు రేవంత్ రెడ్డిని మంద‌కృష్ణ ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే ఊరుకునేది లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

తమ్ముడిగా చెప్తున్నా... కృష్ణన్నా నీ వైఖరి మార్చుకో. బీజేపీ కోసం రేవంత్ రెడ్డిపై మంద‌కృష్ణ బుర‌ద జ‌ల్లుతున్నారు. వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా రేవంత్ త‌ల‌వంచ‌లేదు. వర్గీకరణ వేస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకున్న వ్యక్తి రేవంత్. వర్గీకరణ కోసం అసెంబ్లీ నుండి రేవంత్ సస్పెండ్ అయ్యారు. చిన్న సహాయం చేసినా మాదిగలు జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటారు అని ప్రీతం తెలిపారు.

వర్గీకరణ చేయాలని 1965లోనే లోకూర్ కమిషన్ తేల్చి చెప్పింది. 1975, 1990లలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ కోసం మాట్లాడాయి. వర్గీకరణ చేసిన రేవంత్‌పై కృష్ణ మాదిగకు ఎందుకు కృతజ్ఞత లేదు. మందకృష్ణ మాదిగతో పరేడ్ గ్రౌండ్‌లో సింహ గర్జన పెట్టమని రేవంత్ సలహా ఇచ్చారు. సింహా గర్జన కోసం ఖర్చు అయిన ప్రతి రూపాయి రేవంత్ పెట్టాడు. అంబేద్కర్ వాదాన్ని వదిలేసిన మందకృష్ణ మనువాదాన్ని మోస్తున్నాడు. బీజేపీ ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్న కృష్ణ మాదిగ దళిత జాతికి ద్రోహం చేస్తున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో వర్గీకరణ ఎందుకు అమలుకావడం లేదో మందకృష్ణ సమాధానం చెప్పాలి. కేసీఆర్ దళితుల భూములు గుంజుకున్నప్పుడు మందకృష్ణ ఎక్కడున్నాడు? బీజేపీ 13 రాజ్యసభ స్థానాలలో ఇద్దరు దళితులకి అవకాశం ఇచ్చింది. కాంగ్రెస్ ఐదు రాజ్యసభ స్థానాల్లో ఇద్దరు దళితులకి అవకాశం ఇచ్చింది అని ప్రీతం గుర్తు చేశారు.

Advertisement
Advertisement